‘లైగర్’ లాంటి భారీ ఫ్లాప్ పడేసరికి విజయ్ దేవరకొండ గురించి ఫ్యాన్స్ చాలా భయపడ్డారు. తర్వాత సినిమాల సంగతేంటి అని అనుకున్నారు. కానీ అవేం లేకుండా విజయ్ ఒకటి తర్వాత ఒకటి.. వరసగా కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. త్వరలో ‘ఖుషి’ షూటింగ్ లో తిరిగి పాల్గొనున్న విజయ్.. అది కాకుండా మరో ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అందులో ఓ మూవీ సంగతి ఏంటనేది పక్కనబెడితే.. తాజాగా ప్రకటించిన కాంబో మాత్రం మరోసారి సెన్షేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయిపోయుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చే సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఫుల్ రగ్గ్ డ్-మాస్ అవతార్ లో కనిపించిన ఈ సినిమా తర్వాత ‘గీతగోవిందం’ లాంటి సాఫ్ట్ క్యారెక్టర్ ఉన్న సినిమాతో వచ్చాడు. ఈ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచి చెరో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. అయితే ఆ తర్వాత విజయ్ కు ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన హిట్ పడలేదు. సినిమాలు చేస్తున్నాడు, రిలీజ్ అవుతున్నాయి గానీ హిట్ అయితే కాలేకపోతున్నాయి. గతేడాది ఆగస్టులో కూడా ‘లైగర్’ అంటూ పాన్ ఇండియా స్థాయిలో హడావుడి చేశారు గానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది.
ఇక సమంతతో కలిసి చేస్తున్న ‘ఖుషి’ ఇంకా షూటింగ్ స్టేజీలో ఉంది. దీని తర్వాత ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో కలిసి పోలీస్ డ్రామాలో నటిస్తాడు. ఇప్పుడు ఈ రెండు లైన్ లో ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్టును విజయ్ ఒప్పుకొన్నాడు. తనకు ‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ తో మరోసారి కలిసి పనిచేయనున్నాడు. కొన్నిరోజుల ముందు వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ కాంబోని సెట్ చేశారు నిర్మాత దిల్ రాజు. అధికారికంగా ట్వీట్ చేసి మరీ అనౌన్స్ చేశారు. అయితే ఇది ‘గీతగోవిందం’ సీక్వెల్ అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. విజయ్-రష్మిక కాంబో సెట్ అయితే బాగుండు అని మాట్లాడుకుంటున్నారు. మరి ‘గీతగోవిందం’ కాంబో రిపీట్ కావడంపై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
We are getting back together.@ParasuramPetla @SVC_official https://t.co/pxT6NqHWXc
— Vijay Deverakonda (@TheDeverakonda) February 5, 2023