Gautham Vasudev Menon: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. తెలుగులోనూ డైరెక్ట్ సినిమాలు చేసి ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఘర్షణ, ఏమాయ చేశావేతో మంచి హిట్స్‌ను అందుకున్నారు. వీటితో పాటు పలు ప్రేమ సినిమాలు చేసి యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. గౌతమ్ మీనన్ తాజా చిత్రం ‘‘వెందు తానిందదు కాదు’’ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని చోట్లా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక, ఈ సినిమా తెలుగులో ‘‘ముత్తు’’ గా రిలీజైంది. చిత్రం విడుదల సందర్భంలో దర్శకుడు గౌతమ్ మీనన్ పలు తెలుగు యూట్యూబ్, టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్న, దానికి గౌతమ్ మీనన్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంటర్వ్యూ చేసే యాంకర్ గౌతమ్ మీనన్‌ను ‘‘ మీరు చేసిన రీసెంట్ సినిమాలో చాలా మంది ఉన్నారు. శింబు గారు, విజయ్ సేతుపతి గారు, అంతమంది స్టార్స్‌ను ఒక దగ్గరకు తీసుకురావటం.. ఎంత కష్టంగా అనిపించింది?’’ అని అడిగాడు. యాంకర్ అడిగిన సినిమా పేరు ‘‘ చెక్క చివంత వానమ్’’ ఈ సినిమాలో అరవింద స్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్ విజయ్ కలిసి నటించారు. ఈ సినిమా తెలుగులో ‘నవాబ్’గా విడుదలైంది.
అయితే, ఈ సినిమాకు దర్శకత్వం వహించింది గౌతమ్ మీనన్ కాదు.. మణిరత్నం. ఈ విషయం తెలియకుండా యాంకర్ గౌతమ్ మీనన్‌ను మణిరత్నం సినిమా గురించి అడిగారు. దీనికి గౌతమ్ మీనన్ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. ఆ సినిమా తానే చేసినట్లు.. అందుకోసం చాలా కష్టపడినట్టు చెప్పుకొచ్చారు. గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. ‘‘ అరవింద స్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్ విజయ్ కలిసి పని చేయటం చాలా కష్టమైన పని. వాళ్లు చాలా బిజీ నటులు, వాళ్ల డేట్లు పట్టుకోవటం చాలా కష్టం అయింది. నేను మణిరత్నాన్ని కదా.. నేను పిలిచినప్పుడు వచ్చి తీరాలి.
నేను ఉదయం 4.30-5 గంటలకు షూటింగ్ స్టార్ట్ చేసేవాడిని. వాళ్లు సమయానికి అక్కడికి వచ్చేవాళ్లు. గౌతమ్ మీనన్ సినిమాకు శింబు 7 గంటలకు షూటింగ్‌కు వచ్చాడని వినుంటారు. కానీ, నేను మణిరత్నాన్ని కదా అందుకే సమయానికి షూటింగ్ వచ్చేవాడు. అది చాలా గొప్ప అనుభవం’’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఆయన జోక్ చేస్తున్నారని యాంకర్‌కు అర్థంకాకపోవటం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్త్ను జనం యాంకర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Adakka mudiyatha sirippu when he’s like but then yknow, I’m Mani ratnam 😂😂😂😂 https://t.co/nofu3Qz9dh
— Savi (@savithrika) September 20, 2022
ఇవి కూడా చదవండి : Actress Jayakumari: సీనియర్ నటి జయకుమారి దీనస్థితిపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం!