దేశానికి అన్నం పెట్టేవాడు రైతన్న.. ఈ దేశానికే వెన్నెముక.. రైతే రాజు ఇలా కొటేషన్స్ చాలానే చెప్తాం. తీరా రైతుకు మద్దతుగా నిలవాల్సి వచ్చినప్పుడు ఎవరి స్వార్థం వారు చూసుకుంటారు. ఆరుగాలం శ్రమించి.. చెమటను ధార పోసి.. పంటను ప్రాణంలా చూసుకునే రైతన్నను ప్రజలు, రాజకీయ నేతలే కాదు.. ప్రకృతి కూడా మోసం చేస్తుంది. పంట చేతికి వస్తుంది అన్న సమయంలో వారికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ వార్తలు చూసి అయ్యో పాపం అంటాం కానీ ఆదుకునేందుకు ముందుకు రాం.
ఇది కూడా చదవండి: అరేయ్ ల** కొడకల్లారా అంటూ.. స్టేజ్ పైనే ఏడ్చేసిన గణేశ్ మాస్టర్!
కానీ ఇలాంటి కష్టాలు చూసి.. తక్షణమే స్పందించి తనకు తోచిన సాయం చేస్తారు కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్. ఇప్పటికే ఢీ షో వేదిక మీదుగా పలుమార్లు తన మంచి మనసు చాటుకున్న గణేష్ మాస్టార్.. మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తరువాతి వారం ప్రసారం కాబోయే షోకి సంబంధించి విడుదల చేసిన ఢీ తాజా ప్రోమోలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ డ్యాన్స్ పై గణేష్ మాస్టర్ కామెంట్స్!ఓ రైతు నిజ జీవితం ఆధారంగా చేసుకుని ఢీ షోలో ఓ కంటెస్టెంట్ పర్‌ఫామెన్స్ చేశాడు. రెండు కాళ్లు.. లేకపోయినా.. చక్రాల సైకిల్‌కే పరిమితమైన.. వ్యవసాయం మీద మక్కువతో.. సదరు రైతు దాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తుంటాడు. అతడి జీవితాన్ని.. రైతుల గొప్పదన్నాన్ని చాటుతూ డ్యాన్స్ చేశారు. ఇక చివర్లో సదరు రైతు కూడా స్టేజీ మీదకు వస్తాడు. అతడి కష్టాన్ని చూసి చలించిపోయిన గణేష్ మాస్టర్ తన రెండు వారాల రెమ్యూనరేషన్‌ని సదరు రైతుకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గణేష్ మాస్టర్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: తీవ్ర దుఃఖంలో ‘ఢీ’ యశ్ మాస్టర్! కన్నీరు పెట్టుకుంటూ వీడియో రిలీజ్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.