సినీ ఇండస్ట్రీలు వివాదాలు సర్వసాధారణం. మరీ ముఖ్యంగా కొన్ని సినిమాలు వివాదాల్లో చిక్కుకుంటాయి. తమ వర్గాన్ని, కులాన్ని, మతాన్ని కించరిచారంటూ పలువురు ఆందోళనలు చేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో తమనేతను అవమానించేలా సినిమాను తీశారంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్ల సినిమాలు సైతం వివాదాల్లో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఆదాశర్మ సినిమా ఒకటి కూడా వివాదంలో చిక్కుకుంది ఆదాశర్శ ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ సోర్టీ’ అనే సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇటీవల విడుదలై ఈ సినిమా టీజర్ పై కేరళ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
అందాలభామ ఆదాశర్మ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అనంతరం మరికొన్ని సినిమాలు చేసింది. ఆతర్వాత తెలుగు చిత్రపరిశ్రమకు దూరమైంది. అప్పుడప్పుడు కొన్ని సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుంది. తాజాగా ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదలైంది. కేరళలో 32 వేల మంది అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి విదేశాలకు పంపించి ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారంటూ ఓ డైలాగ్ ఆ మూవీ టీజర్ లో ఉంది.
అదే డైలాగ్ ఇప్పుడు కేరళలో వివాదానికి కారణమయ్యింది. ఇక ఇదే విషయం పై కొందరు అభ్యంతరం తెలుపుతూ కేరళ సీఎం పినరయి విజయ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రాష్ట్ర డీజీపీ అనిల్ కాంత్.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ‘ది కేరళ స్టోరీ’ మూవీ టీజర్ వైరల్ గా మారింది ఈ మూవీ టీజర్ ..”నా పేరు షాలిని ఉన్నికృష్ణన్. నర్సుగా ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. ఇప్పుడు నేను ఫాతిమా బా అనే ఐసిస్ ఉగ్రవాదిని. నేను ఆఫ్ఘనిస్థాన్‌లో జైల్లో ఉన్నాను” అనే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. అంతేకాకా..”నేను ఒకదానినే కాదు. నాలాంటి వారు 32 వేల మంది అమ్మాయిలు మతం మారి సిరియా, యెమెన్ ఎడారుల్లో మరణించారు.
ఓ సాధారణ అమ్మాయి ప్రమాదకరమైన ఉగ్రవాదిగా మారే భయంకరమైన ఆట కేరళలో చోటుచేసుకుంది. అది కూడా బహిరంగంగానే జరుతుంది. దీన్ని ఎవరూ ఆపలేదా? ఇది నా కథ. ఇదే 32 వేల మంది అమ్మాయిల కథ ఇది” అంటూ ఆదాశర్మ ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ తో టీజర్ ముగిసింది. అదే విధంగా ఈ సినిమా టీజర్ లో మాజీ సీఎం వీఎస్ అచ్యుతానంద గతంలో ప్రసంగానికి తప్పుగా సబ్ టైటిల్స్ వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Fun fact: We also found another promo for #TheKeralaStory where Sen has misrepresented the words of another former CM VS Achuthanandan. The promo shows a 17-second clip of former CM VS Achuthanandan. Guess what? The eng subtitles had no similarities with what was being said. pic.twitter.com/neCBAri2N5
— Shinjinee Majumder (@shinjineemjmdr) November 8, 2022