బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అనగానే అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. గత కొన్నేళ్ల నుంచి అందరూ పాన్ ఇండియా, పాన్ ఇండియా అని అంటున్నారు. షారుక్ అయితే టెక్నాలజీ, ఓటీటీ కల్చర్ లేని చాలా ఏళ్ల క్రితమే దేశంలోని ప్రతి ఒక్కరికీ చేరువయ్యారు. తన సినిమాలతో ఎంటర్ టైన్ చేశారు. అయితే గత కొన్నేళ్లుగా మాత్రం షారుక్ నుంచి సినిమాలే రాలేదు. 2018 చివర్లో ‘జీరో’ మూవీతో వచ్చారు కానీ అది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. అప్పటి నుంచి మొన్నటి వరకు అంటే దాదాపు ఐదేళ్లపాటు ప్రేక్షకులకు కనిపించలేదు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. షారుక్ ఖాన్ నుంచి చాలారోజుల తర్వాత థియేటర్లలోకి వచ్చిన మూవీ ‘పఠాన్’. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీసిన ఈ సినిమా అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఎంటర్ టైన్ చేస్తోంది. వందల కోట్ల కలెక్షన్స్ కూడా వచ్చిపడుతున్నాయి. దేశభక్తి అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ మూవీ.. షారుక్ ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చేస్తోంది. ఇక తన సినిమా హిట్ అయిన ఆనందంలో ఉన్న షారుక్.. ట్విట్టర్ లో #AskSRK పేరుతో ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. పలు విషయాలు మాట్లాడినప్పటికీ.. ఓ అమ్మాయికి షారుక్ ఇచ్చిన ఆన్సర్ మాత్రం హైలెట్ గా నిలిచింది.
బాద్ షా షారుక్ కు ఆల్రెడీ పెళ్లయి, ముగ్గురు పిల్లలున్నారు. అయినా సరే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. అలా.. ఓ అమ్మాయి అయితే ఏకంగా డేటింగ్ కు వెళ్దామా అని ప్రపోజల్ పెట్టింది. సాధారణంగా హీరోలతో మాట్లాడే-కలిసే ఛాన్స్ వస్తే సెల్ఫీ లేదంటే మరేదైనా అడుగుతారు. కానీ విద్య అనే అమ్మాయి మాత్రం.. ‘మ్యారేజ్ ప్రపోజల్ కాదు గానీ వాలంటైన్స్ డేన డేట్ కి వస్తారా?’ అని ట్వీట్ చేసింది. దీనికి అంతే జోవియల్ గా రిప్లై ఇచ్చిన షారుక్.. ‘డేటింగ్ విషయానికొస్తే నేను చాలా బోరింగ్. ఎవరైనా కూల్ గా ఉండే అబ్బాయితో ‘పఠాన్’ సినిమాకు వెళ్లు’ అని రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అమ్మాయి ఆఫర్, షారుక్ ఆన్సర్ మీకెలా అనిపించాయి. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
I am boring as a date….take some cool guy and watch #Pathaan in a theatre https://t.co/yCKPFo1QcS
— Shah Rukh Khan (@iamsrk) February 4, 2023