ఈ ఫోటోలో ఉన్న నటుడ్ని గుర్తుపట్టారా? చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, జగపతిబాబు, సుమంత్ వంటి హీరోలు ఈ నటుడి సినిమాలను రీమేక్ చేశారు. ఎవరో గుర్తుపట్టారా?
సీనియర్ నటి రాధికతో ఉన్న ఉన్న ఈ హీరోని గుర్తుపట్టారా? ఇప్పుడొక స్టార్ హీరో. మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. ఒక సినిమా చేస్తే వంద కోట్ల పైనే పారితోషికం తీసుకుంటారు. ఈయన నటించిన సినిమాని జగపతిబాబు రీమేక్ చేసి హిట్ కొట్టారు. అలానే పవన్ కళ్యాణ్ కూడా ఈ హీరో సినిమాలు రీమేక్ చేసి సూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్ కొట్టారు. నాగార్జున నటించిన ఒక సినిమా కూడా ఈ హీరో నటించిన సినిమాకి రీమేకే. అయితే ఈ హీరో సినిమాలని మన హీరోలు రీమేక్ చేయడం అటుంచితే.. ఈ హీరో మన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాని రీమేక్ చేసి పెద్ద హిట్ కొట్టారు. ఈ హీరో సినిమాలను రీమేక్ చేసిన వారిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, కళ్యాణ్ రామ్, సుమంత్, నాగార్జున వంటి హీరోలు ఉన్నారు. చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఈ హీరో రీమేకే. ఇప్పుడు తెలిసిందా ఆ హీరో ఎవరో అని.
అవును శుభాకాంక్షలు, సుస్వాగతం, నువ్వు వస్తావని, ఖుషి, గౌరి, విజయదశమి రీమేడ్ సినిమాలకు ఒరిజినల్ వెర్షన్ లో నటించిన విజయ్ నే ఈ బాల నటుడు. సెలబ్రిటీలకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. పురావస్తు తవ్వకాల్లో బయటపడిన నిధుల్లా అభిమానులు హీరో, హీరోయిన్ల ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో ఫోటో ఒకటి సోషల్ మీడియాలో రౌండ్లు వేస్తుంది. ఒకప్పటి హీరోయిన్, సీనియర్ నటి రాధికతో కలిసి ఒక సినిమాలో నటించారు. ఈ బాలుడు ఎవరంటే దళపతి విజయ్. 1988లో వచ్చిన ఇతు ఎంగల్ నీతి అనే తమిళ సినిమాలో బాల నటుడిగా నటించారు.
అప్పుడు విజయ్ వయసు 14 ఏళ్ళు. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయగా.. ఈ సినిమాలో రాంకీ, రాధికా, వాణీ విశ్వనాథ్ లు లీడ్ రోల్స్ లో నటించారు. నిజానికి విజయ్ వెట్రి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అప్పటికి విజయ్ వయసు 7 ఏళ్ళు. ఆ తర్వాత కుడుంబం, వసంత రాగం వంటి సినిమాల్లో బాల నటుడిగా నటించారు. 1992లో నాలయ తీర్పు అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు తమిళనాట దళపతిగా, సూపర్ స్టార్ గా ఎదిగారు. రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్ లకు తెలుగులో గుర్తింపు రావడానికి ఎంతో సమయం పట్టలేదు. కానీ విజయ్ కి మాత్రం చాలా సమయం పట్టింది.
హీరోగా అడుగుపెట్టిన 20 ఏళ్లకు తెలుగులో గుర్తింపు వచ్చింది. తుపాకీ సినిమా నుంచి విజయ్ కి తెలుగులో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత స్నేహితుడు, జిల్లా, కత్తి, అదిరింది, సర్కార్, బీస్ట్, తాజాగా వారిసు.. తెలుగులో వారసుడుగా విడుదలైంది. ఇలా ఒక్కో సినిమాకు అంచనాలు పెంచుకుంటూ ఎదిగారు. తమిళ ప్రేక్షకులదే కాకుండా తెలుగు ప్రేక్షకుల క్రేజ్ కూడా సొంతం చేసుకున్నారు. మరి విజయ్ చైల్డ్ హుడ్ ఫోటోపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.