రాజమౌళి గతంలో సై సినిమాలో ఓ చిన్న పాత్ర చేశారు. నల్ల బాలు అనుచరుడిగా కనిపించారు. తర్వాత తన సినిమాల్లో పాటల్లో కనిపిస్తూ వస్తున్నారు. తాజాగా, ఓ కమర్షియల్ యాడ్‌లో ఆయన నటించారు.
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన దర్శకుడిగా రాజమౌళి పేరు చరిత్రలో నిలిచిపోతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం తెలుగు సినిమానే కాదు.. భారత సినిమాను కూడా ఆయన ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఆస్కార్ రావటమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ ప్యాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమా తెరకెక్కడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి.. రాజమౌళి పాత కమిట్‌మెంట్లకు సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయారు.
రాజమౌళి మొదటిసారి ఓ కమర్షియల్ యాడ్‌లో నటించారు. ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ ఓప్పోకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. ఈ ఫోన్ యాడ్ కోసం షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. ఆ షూటింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజమౌళి మొదటిసారి ఓ కమర్షియల్ యాడ్ చేస్తుండటంతో అందరి దృష్టి దీనిపైనే పడింది. దానికి తోడు ఆ యాడ్‌లో ఆయన అదిరిపోయే లుక్‌లో అల్లాడించేశారు. పింక్ కోటులో..
పెప్పర్ అండ్ సాల్డ్ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించారు. ఈ యాడ్‌కు ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు దర్శకత్వం వహించినట్లు తెలుస్తోంది. కాగా, రాజమౌళికి నటన కొత్తేమీ కాదు. గతంలో ఆయన చాలా సినిమాల్లో అతిధి పాత్రల్లో కనిపించారు. సై సినిమాలో నల్ల బాబు అనుచరుడిగా మనం రాజమౌళిని చూడొచ్చు. ఆయన తాజా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌లో ‘ ఎత్తర జెండా’ పాటలో కూడా రాజమౌళి కనిపించారు. మరి, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రాజమౌళి మొదటి యాడ్ ఫిల్మ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.