ఓరు ఆదార్ లవ్ (తెలుగులో లవర్స్ డేతో డబ్బింగ్ కూడా చేశారు) సినిమాలో కళ్లు ట్వింక్ చేసి కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించింది. ఈ ఒక్క సీన్‌తోనే ఆమె సైడ్ క్యారెక్టర్ కాస్త.. మెయిన్ లీడ్‌కు చేరింది.
ఒక్క సినిమాతో, ఒక్క డైలాగ్‌తో, ఒక్క సాంగ్‌తో, ఒక్క సీన్‌తో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయిన వాళ్లు ఉన్నారు. ఆ కోవకో వస్తుంది ప్రియా ప్రకాశ్ వారియర్. ఓరు ఆదార్ లవ్ (తెలుగులో లవర్స్ డేతో డబ్బింగ్ కూడా చేశారు) సినిమాలో కళ్లు ట్వింక్ చేసి కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించింది. ఈ ఒక్క సీన్‌తోనే ఆమె సైడ్ క్యారెక్టర్ కాస్త.. మెయిన్ లీడ్‌కు చేరింది. ఇదే విషయంపై మరో నటి నూరీన్ షరీఫ్ అప్పట్లో కారాలు, మిరియాలు కూడా నూరింది. కన్నుకొట్టే సీన్ దేశ వ్యాప్తంగా పాపులర్ కావడంతో కథను మార్చి.. తన పాత్రను తగ్గించేశారంటూ గగ్గోలు పెట్టింది. 2019లో విడుదలైన ఈ సినిమా బోక్కాబోర్లా పడింది. అయితే క్రేజ్‌ను కాపాడుకోలేకపోయింది ప్రియా ప్రకాశ్ వారియర్
చెక్, ఇష్క్ వంటి తెలుగు సినిమాలతో పాటు అడపా దడపా ఇతర భాషల్లోనూ సినిమాలు చేసినప్పటికీ ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. అయితే ఇప్పుడు ఈ భామ ఏరుకోరి ఓ వివాదాన్ని తలపైకి తెచ్చుకుంది. అదే ఓరు ఆదార్ లవ్ సినిమాలో కన్ను కొట్టే ఐడియా తనదేనంటూ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిని ఆయన సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆమెకు గట్టిగా కౌంటరిచ్చారు దర్శకుడు ఒమర్ లూలూ. ‘పాపం పిచ్చి పిల్ల. 5 ఏళ్ల క్రితం ఏం జరిగిందో మర్చిపోయినట్లు ఉంది. జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి వలయ చాందినీ తైలం బాగా ఉపయోగపడుతుంది’అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ తైలం ముంబయిలో కూడా ట్రెండింగ్ అవుతుంది అంటూ వరుస ట్వీట్లు చేశారు.