డైరెక్టర్ మారుతి డాటర్ హియా దాసరి కూడా మంచి టాలెంటెడ్. తను పెయింటింగ్స్ అద్భుతంగా వేస్తుంది. కొడుకేమో మ్యూజిక్, బ్యాండ్స్ అంటూ టాలెంట్ చూపిస్తుంటాడు. హియా పెయింటింగ్స్ వేయడంలో దిట్ట. రీసెంట్‌గా ఓ ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేసింది.
ఈ జెనరేషన్ సెలబ్రిటీ కిడ్స్ ఎంత యాక్టివ్‌గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ కూతురు సితార యాడ్‌లో, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ‘శాకుంతలం’ లో బాల నటిగా చేసి మెప్పించారు. దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురితో కలిసి సితార యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. వీళ్ల లాగే డైరెక్టర్ మారుతి డాటర్ హియా దాసరి కూడా మంచి టాలెంటెడ్. తను పెయింటింగ్స్ అద్భుతంగా వేస్తుంది. కొడుకేమో మ్యూజిక్, బ్యాండ్స్ అంటూ టాలెంట్ చూపిస్తుంటాడు. హియా పెయింటింగ్స్ వేయడంలో దిట్ట. రీసెంట్‌గా ఓ ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేసింది. అల్లు అరవింద్ వంటి కొందరు సినీ ప్రముఖులు విచ్చేసి హియా ప్రతిభను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా మీడియా హియాను ఇంటర్వూ చేసింది.
హియా మాట్లాడుతూ.. టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ వరల్డ్ హీరో ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ వీడియోను డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ‘ప్రభాస్ ఎంతో మంచివారు. హుందాగా, గర్వం లేకుండా, ఎంతో వినయంగా ఉంటారు. ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవాలి. ప్రభాస్‌కి ఫుడ్ అంటే ఇష్టం, నాక్కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టం. ప్రభాస్ అందరికీ ప్రేమగా ఫుడ్ పెడతారు. ఎదుటి వారికి సాయం చేయడంలో ముందుంటారు. ఆయనే నాకు స్ఫూర్తి’ అని చెప్పుకొచ్చింది. తమ హీరో గురించి చాలా బాగా మాట్లాడిందంటూ హియాను అభినందిస్తూ.. ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.
మారుతి దర్శకత్వంలో సైలెంట్‌గా ఓ సినిమా చేసేస్తున్నాడు ప్రభాస్. ‘రాజా డీలక్స్’, ‘అంబాసిడర్’ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్న ఈ మూవీ సూపర్ నేచురల్ హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని సమాచారం. లీక్డ్ ఫోటోలో డార్లింగ్ లుక్ రివీల్ అవడంతో అంచనాలు పెరిగాయి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అప్‌డేట్ ఇవ్వలేదు టీం. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇటీవల విడుదల చేసిన ‘కల్కి – 2898ఏడీ’ టైటిల్ గ్లింప్స్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
” Prabhas is very humble & loveable person & my Favourite actor , There’s a lot to learn from him i.e how to give it to people etc. , he is one of my biggest inspiration – Artist Hiya Dasari
Director #Maruti ‘s daughter pic.twitter.com/oOFTUwpqKM
— Salaar (@Agan_Veera) August 2, 2023