దర్శకులైనా, రచయితలైనా.. గొప్ప కథలు, డైలాగులు రాసే టాలెంట్ ఉండి.. సక్సెస్ కాలేకపోతున్నారు అనంటే.. అది చాలా బాధాకరమైన విషయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే.. క్లాసిక్ అని చెప్పుకునే సినిమాలు రేర్ గానే వస్తుంటాయి. అవి క్లాసిక్ హిట్స్ గా చెప్పుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ విధంగా తెలుగులో దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన ప్రస్థానం సినిమా.. అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది.
ఇండస్ట్రీలో దర్శకులైనా, రచయితలైనా.. గొప్ప కథలు, డైలాగులు రాసే టాలెంట్ ఉండి.. సక్సెస్ కాలేకపోతున్నారు అనంటే.. అది చాలా బాధాకరమైన విషయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే.. క్లాసిక్ అని చెప్పుకునే సినిమాలు రేర్ గానే వస్తుంటాయి. అవి క్లాసిక్ హిట్స్ గా చెప్పుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ లో దాదాపు ఎక్కువ కేటగిరిలకు ప్రేక్షకులు కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కాదు అనుకుంటే.. కథ, డైలాగ్స్ పరంగా కూడా క్లాసిక్స్ గా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఆ విధంగా తెలుగులో క్లాసిక్ హిట్ గా చెప్పుకునే సినిమాలలో ప్రస్థానం(2009) ఒకటి. దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన ఈ సినిమా.. అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది.
ఒక కొత్త రకమైన స్క్రీన్ ప్లే, ఆలోచింపజేసే మాటలతో దేవా కట్టా.. ఆ సినిమాని నడిపించిన విధానానికి అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఇండస్ట్రీకి మరో గొప్ప డైరెక్టర్ దొరికాడు.. అనే ఫీలింగ్ అందరిలోనూ కలిగింది. కానీ.. ప్రస్థానం తర్వాత ఆ స్థాయి సినిమాని, నార్మల్ హిట్ అనిపించుకునే సినిమాలను కూడా ఖాతాలో వేసుకోలేకపోయాడు. ప్రస్థానం తర్వాత ఐదేళ్లు గ్యాప్ తీసుకొని ‘ఆటోనగర్ సూర్య’ తీశాడు. ఆ సినిమా నిరాశపరిచినా అందులో దేవా కట్టా మార్క్ కనిపిస్తుంది. కానీ.. ఆ తర్వాత మంచు విష్ణు హీరోగా డైరెక్ట్ చేసిన మూవీ ‘డైనమైట్’ మూవీ.. ఆయన కెరీర్ లో ఎందుకు చేశాడా? అని ఫీల్ కలిగించింది. ఈ విషయాన్ని కూడా దేవా కట్టానే స్వయంగా ఇంటర్వ్యూలలో చెప్పారు.
డైనమైట్ మూవీ తమిళ సూపర్ హిట్ ‘అరిమా నంబి’కి రీమేక్. కాగా.. ఈ సినిమా కోసం దేవా కట్టా కేవలం 9 రోజులు మాత్రమే వర్క్ చేసి.. ఆ తర్వాత క్రియేటివ్ డిఫరెన్సుల వలన తప్పుకున్నాడట. కానీ.. ఆ సినిమాకి దర్శకుడిగా పూర్తి క్రెడిట్ ఇచ్చాడు మంచు విష్ణు. తాజాగా ఈ సినిమా గురించి దేవా కట్టా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డైనమైట్ నా సినిమా కాదు.. ఆ సినిమా ఎందుకు చేశానా అని ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉంటాను. ఎందుకంటే.. అది తమిళ్ మూవీకి రీమేక్. నాకు రీమేక్స్ ఓన్ చేసుకోవడం తెలియదు. ఒకవేళ అది నా సినిమా రీమేక్(ప్రస్థానం హిందీ) అయినాసరే అంతే. ఎందుకంటే.. తప్పు జరుగుతుందని తెలిసి కూడా ఆ జర్నీ కంటిన్యూ చేయడం తప్పే అవుతుంది. నేను చేసింది అదే” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేవా కట్టా.. ఇంద్రప్రస్థం, జెడిఆర్ అని రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. మరి దేవా కట్టా మూవీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.