దర్శకులైనా, రచయితలైనా.. గొప్ప కథలు, డైలాగులు రాసే టాలెంట్ ఉండి.. సక్సెస్ కాలేకపోతున్నారు అనంటే.. అది చాలా బాధాకరమైన విషయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే.. క్లాసిక్ అని చెప్పుకునే సినిమాలు రేర్ గానే వస్తుంటాయి. అవి క్లాసిక్ హిట్స్ గా చెప్పుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ విధంగా తెలుగులో దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన ప్రస్థానం సినిమా.. అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది.
సుప్రీం హీరో సాయితేజ్‌ను నటుడిగా ఇంకో మెట్టు ఎక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’ను ఆవిష్కరించిన దర్శకుడు దేవ కట్టా, చిత్ర బృందాన్ని పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ అభినందించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 1న సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. సమాజాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ఒకటైన సినిమా మాధ్యమంలో ప్రభావ వంతమైన సినిమాలు చేయాలని భావించి ప్రారంభం నుంచి అలాంటి సినిమాలనే తెరకెక్కిస్తోన్న దర్శకుడు […]
సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ అక్టోబర్ 1న రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానులు కూడా సినిమాకు మంచి రేటింగ్ ఇస్తున్నారు. సినిమా మొత్తంలో అందరూ క్లైమాక్స్ గురించే ప్రస్తావిస్తున్నారు. అవకాశాలు లేని సమయంలో దర్శకుడు దేవకట్టను నమ్మి సాయిధరమ్ తేజ్ ఒక అవకాశం ఇచ్చాడు. సాయిధరమ్ తేజ్ ఇచ్చిన అవకాశాన్ని, పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు దేవకట్ట నిలబెట్టుకున్నాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు.. […]
తెలుగు సినిమా చరిత్రలో ప్రస్థానం మూవీకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు దేవాకట్టా. కారణాలు ఏవైనా తరువాత కాలంలో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ గాడి తప్పాడు. కానీ.., ఇప్పుడు ఓ పదునైన ఆలోచనతో రిపబ్లిక్ అనే మూవీ తెరకెక్కించారు దేవాకట్టా. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటించిన రిపబ్లిక్ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. రిపబ్లిక్ మూవీ ఎలా ఉందొ ఈ […]