సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఒక్కొక్కరిగా తమ కుటుంబ సభ్యులను అనాథలను చేసి వెళ్లిపోతున్నారు. గత ఏడాది తెలుగు సినీ దిగ్గజాలు కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, జమున మరణంతో విషాదంలో మునిగిన టాలీవుడ్ కి కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతి తీవ్రంగా కలచివేసింది. ఆయన లేరన్న సంఘటన నుంచి తేరుకోకముందే ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం అనుమానాస్పదంగా మృతి చెందారు. వాణి జయరాం మృతిపై పలు అనుమానాలు వస్తున్న నేపథ్యంలో.. పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు, సీఎం స్నేహితుడు అనారోగ్యంతో మరణించారు.
సాధారణంగా రాజకీయ నాయకులకు ఇండస్ట్రీలోనూ, బయట స్నేహితులే కాదు, ప్రాణ స్నేహితులు కూడా ఉంటారు. నారా చంద్రబాబు నాయుడు ప్రాణ స్నేహితుడు మృతి చెందగా.. సీఎం ప్రాణ స్నేహితుడు మృతి చెందారు. ఎంగ ఊరు కావాల్ కారన్, మిడిల్ క్లాస్ మాధవన్, బడ్జెట్ పద్మనాభన్ వంటి పలు చిత్రాలకు దర్శకుడిగా పని చేసిన టీపీ గజేంద్రన్. అంతే కాదు ఆయన పలు చిత్రాల్లో కామెడీ పాత్రల్లో నటించి అందరినీ నవ్వించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కు ప్రాణ స్నేహితుడు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న టీపీ గజేంద్రన్ ఆదివారం మృతి చెందారు. కె. బాలచందర్, విసు, రామ నారాయణన్ వంటి దర్శకుల దగ్గర 60 సినిమాలకు పైగా సహాయకుడిగా పని చేశారు. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా మంచి ఇమేజ్ సంపాదించారు గజేంద్రన్.
గజేంద్రన్ మృతిపై ఆయన స్నేహితుడు, తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తో గజేంద్రన్ కు మంచి స్నేహబంధం ఉంది. కాలేజ్ లో గజేంద్రన్ తన సహచరుడని, ఆయన మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని స్టాలిన్ అన్నారు. 2021 సెప్టెంబర్ లో గజేంద్రన్ ను కలిసి పరామర్శించానని.. సినీ రంగానికి ఉత్తమ సేవలందించారని అన్నారు. పలువురు సినీ ప్రముఖులు, సీఎం స్టాలిన్ ఆయన మృతి పట్ల నివాళులు అర్పించారు.