తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ జెండా ఎగురవేసింది.
తెలుగు నిర్మాతల మండలి ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో నిర్మాత దిల్ రాజు ప్యానెల్ విజయం సాధించింది. తెలుగు నిర్మాతల మండలి నూతన అధ్యక్షుడిగా దామోదర్ ప్రసాద్ ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఎన్నికలు జరిగిన మొదలైన విషయం తెలిసిందే. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ నిర్మాతలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల్లో దిల్ రాజు ప్యానెల్ నుంచి పది మంది సభ్యులు విజయం సాధించగా.. నిర్మాత సి. కళ్యాణ్ ప్యానెల్ నుంచి ఐదుగురు సభ్యులు విజయం సాధించారు.
దాదాపు 1600 మంది నిర్మాతలు కలిగిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి సంబంధించిన ఎలక్షన్స్ ఫలితాల్లో దిల్ రాజు ప్యానెల్ విజయం సాధించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్, దిల్ రాజు, స్రవంతి రవి కిషోర్, సి. కళ్యాణ్, పోసాని కృష్ణ మురళి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దిల్ రాజు మద్దతుతో కెఎల్ దామోదర్ ప్రసాద్ ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కి నాయకత్వం వహిస్తుండగా.. సి. కళ్యాణ్ మద్దతుతో జెమిని కిరణ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి నాయకత్వం వహిస్తున్నారు. రెండు ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గా రెండు వర్గాలుగా ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తం ఓట్లు 1600 కాగా.. కేవలం 678 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. వీటిలో దామోదర్ ప్రసాద్ కు 339 ఓట్లు పోల్ అవ్వగా.. జెమిని కిరణ్ కు 315 ఓట్లు పోల్ అయ్యాయి.
దీంతో జెమిని కిరణ్ పై 24 ఓట్ల తేడాతో దామోదర్ ప్రసాద్ గెలుపొందారు. 24 ఓట్ల మెజారిటీతో దామోదర్ ప్రసాద్ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా గెలుపొందారు. మరోవైపు 378 ఓట్లతో నట్టి ప్రసన్న కుమార్, 362 ఓట్లతో వైవిఎస్ చౌదరి సెక్రటరీలుగా గెలుపొందారు. 412 ఓట్లతో భరత్ చౌదరి, నట్టి కుమార్ లు జాయింట్ సెక్రటరీలుగా ఎంపికయ్యారు. ఇక సుప్రియ యార్లగడ్డ, అశోక్ వైస్ ప్రెసిడెంట్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిర్మాత రామ్ సత్యనారాయణ ట్రెజరర్ గా ఎంపికయ్యారు. కొత్తగా ఎంపికైన సభ్యులు రెండేళ్ల పాటు 2023 నుంచి 2025 వరకూ సేవలను అందిస్తారు. మరి నిర్మాతల మండలి ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ విజయం సాధించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
#Tollywood Producers Council Elections: 2023 – 2025
President: Damodar Prasad
Secretaries: YVS Chowdary, Prasanna
Vice-Presidents: Bharath Chowdary, Natti Kumar #TFPC @tfpcin— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 19, 2023