టాలీవుడ్‌లో ప్రేక్షకులను అలరించిన తారలు ఎందరో.. వారి నటన, అభినయం, అందంతో ఫ్యాన్స్ ని అలరించేవారు. అలాంటి తారల్లో అప్పటి స్టార్ హీరోయిన్ రజినీ కూడా ఒకరు. ఒక్క తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో ఎన్నో సినిమాల్లో నటిస్తూ అందరినీ మెప్పించారు. ఈమె అసలు పేరు శశికౌర్ మల్హోత్రా.. 1965 జులై27న బెంగళూరులో జన్మించారు. నటిగా వెండితెరకు పరిచయం అయిన తర్వాత ఆమెకు అవకాశాలు, ఆదరణ పర్వాలేదనిపించాయి. అన్ని భాషల్లో కలిపి 80కి పైగా చిత్రాల్లో నటించారు. ఒకప్పుడు ఈమె సినిమా వస్తోంది అంటే హిట్ అనే టాక్ కూడా నడిచేది. అయితే ఈమె సినీ జీవితంలో ఓ మాయని మచ్చ ఉందని చెబుతుంటారు.
హీరోయిన్ రజినీకి టాలీవుడ్‌లో పెద్ద అంటూ ఎవరూ లేరు. ఆమెకు దర్శకరత్న దాసరి నారాయణరావుపై ఆధారపడింది. రజినీ సినిమా ఓకే కావాలంటే ముందు ఆ కథ దాసరికి నచ్చాలి. అలా దాసరి ఆమె కాల్ షీట్లు చూసుకోవడం, సినిమా కథలు సెలక్ట్ చేయడం చేస్తుండేవాడు. అలా చేయడం రజినీకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే దాసరి నిర్ణయంతో ఆమె ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించింది. ఓ పదేళ్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. అంతా బాగానే ఉన్నా రజినీ కెరీర్‌లో ఒక్కసారిగా అవకాశాలు రావడం తగ్గిపోయాయి. అంతేకాకుండా స్క్రీన్ మీద నుంచి కూడా ఆమె కనుమరుగు అయిపోయింది. అయితే అందుకు పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు.
అసలు విషయం ఏంటంటే.. రజినీకి కెరీర్‌లో ఒక్కసారిగా అవకాశాలు ఆగిపోయాయి అనేది టాక్. ఏ హీరోయిన్ కెరీర్‌లో అయిన అది కచ్చితంగా జరుగుతుంది. వారికి అవకాశాలు తగ్గిపోవడం, వారికి ఇతర హీరోయిన్ల నుంచి పోటీ పెరగడం అనేది సహజం. అయితే రజినీ కెరీర్‌లో మాత్రం మాయని మచ్చ ఉందని.. దానివల్లే ఆమె కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది అని చెబుతుంటారు. అసలు ఆ ప్రచారాల ప్రకారం.. రజినీ కెరీర్‌లో మేనమామ అనే సినిమా చేసింది. ఆ సినిమాలో నందమూరి కల్యాణ చక్రవరి హీరో. ఆ సినిమా చేస్తున్న సమయంలో ఓరోజు షూటింగ్‌కి ఆమె లేట్‌గా వచ్చారంట. అక్కడి నుండి షూటింగ్ చేయకుండానే కారులో వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారంట.
ఆమె అలా కారులో వెళ్లిపోయేందుకు సిద్ధపడిన సమయంలో ఆమెను హీరో తండ్రి త్రివిక్రమరావు అడ్డగించారంట. ఎందుకు షూటింగ్ చేయకుండా వెళ్లిపోతున్నారంటూ త్రివిక్రమరావు ప్రశ్నించగా.. ఆమె తనకు డబ్బు రావాల్సి ఉందని దురుసుగా సమాధానం చెప్పారంట. ఈరోజు షూటింగ్ పూర్తి చేసుకుని తనకి రావాల్సిన మొత్తాన్ని తీసుకువెళ్లాల్సిందిగా త్రివిక్రమరావు చెప్పారట. అయినా ఆమె కారు డోరు వేసుకునేందుకు ప్రయత్నించగా త్రివిక్రమరావు ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు., వాళ్ల కాల్ షీట్లు మళ్లీ దొరుకుతాయా? అంటూ పిస్టల్ తీసి రజినీని బెదిరించారంట. కదిలితే కాల్చి చంపేస్తాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఆమె షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రావాల్సిన మొత్తాన్ని ఇచ్చి పంపేశారట. ఈ ఘటన గురించి ఎప్పటినుంచో ఒక టాక్ అయితే నడుస్తూ ఉంటుంది. అయితే ఏది నిజం అనేది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. ఆ తర్వాతే రజినీ కెరీర్‌లో అవకాశాలు రావడం తగ్గాయని చెబుతారు.