దక్షిణాది సినీ పరిశ్రమలో సూపర్ స్టార్డం అందుకున్న విజయ్ సేతుపతి పై పరువు నష్టం దావా నమోదైంది. వినటానికి షాకింగ్ గా అనిపించినా ఇది నిజం. నవంబర్ 2న మైసూర్ విమానాశ్రయంలో విజయ్ సేతుపతికి, మహా గాంధీ అనే వ్యక్తికి మధ్య గొడవ అక్కడితోనే ముగిసిందని అనుకుంటే మరోసారి వెలుగులోకి వచ్చింది. చెన్నైకి చెందిన మహా గాంధీ అనే వ్యక్తి.. విమానాశ్రయంలో కనిపించిన నటుడు విజయ్ సేతుపతిని కలిసి తన నటనను మెచ్చుకునే ప్రయత్నం చేసాడు. ఆ తరుణంలో విజయ్ కి సంబంధించిన సిబ్బంది – మేనేజర్ అతని పై దాడికి పాల్పడ్డారని తెలిపాడు.
ఈ దాడిలో తానూ చాలా నష్టపోయానని.. విజయ్ సిబ్బంది దాడి కారణంగా ఓ చెవికి వినికిడి శక్తి కోల్పోయానని ఆ వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అందువలన నటుడు విజయ్ సేతుపతి , అతని సిబ్బంది భారీగా మూల్యం(3 కోట్లు) చెల్లించాలని పరువు నష్టం దావా వేసినట్లు చెప్పుకొచ్చాడు మహా గాంధీ. నటుడి పై ప్రశంసలు కురిపిస్తే ఇలా దాడులు చేస్తారా? అంటూ తనపై విజయ్ బృందం కట్టుకథ అల్లిందని సదరు వ్యక్తి వాపోయాడు.
నిజంగా నాదే తప్పు అయ్యుంటే అప్పుడే ఎందుకు నాపై చర్యలు తీసుకోలేదని.. మహా గాంధీ ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుతం మహా గాంధీకి నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. త్వరలోనే ఈ ఘటన పై విజయ్ సేతుపతి కోర్టుకు హాజరు అవుతారని.. అక్కడే నిజాలు ఏంటో బయట పడతాయని విజయ్ సంబంధిత వర్గాల వారు చెబుతున్నారు. చూడాలి మరి చివరికి ఎవరిది తప్పుగా తేలుతుందో.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపవచ్చు.