సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మక ఇచ్చే అస్కార్ అవార్డు ఫంక్షన్ ఈ నెల 13 న లాస్ ఏంజెల్స్ లో డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరగబోతుంది. ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలంటే నిజంగా అదృష్టం ఉండాలని అంటారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ అవార్డుల రేసులో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ కోసం పోటీపడుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మక ఇచ్చే అస్కార్ అవార్డు ఫంక్షన్ ఈ నెల 13 న లాస్ ఏంజెల్స్ లో డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరగబోతున్న విషయం తెలిసిందే. ఈసారి భారతీయ సినిమాలు కూడా సందడి చేస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ అవార్డుల రేసులో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీలోని ‘నాటు నాటు’ పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకొని ఆస్కార్ అవార్డులకుషార్ట్ లీస్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ కోసం పోటీపడుతుంది. తాజాగా ఆస్కార్ అవార్డు ఫంక్షన్లో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ లో ఇటీవల షారూఖ్ ఖాన్, దీపికా పదుకునే నటించిన ‘పఠాన్’ చిత్రం బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాదు.. వెయ్యికోట్ల క్లబ్ లో చేరింది. తన గ్లామర్ తోనే కాదు.. యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టింది దీపికా పదుకునే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకోనున్నది. లాస్ ఏంజెల్స్ లో మార్చి 13న జరుగనున్న ఆస్కార్ వేడుకలో అవార్డ్స్ ప్రజెంటర్‌గా దీపికా పదుకునే సందడి చేయబోతుంది. భారత్ నుంచి ఈ ఘనత సొంతం చేసుకున్న ఏకైక నటిగా రికార్డు క్రియేట్ చేసింది అందాల భామ దీపికా. ఈ మేరకు ప్రజెంటర్స్ లీస్ట్ అనౌన్స్ మెంట్ చేశారు ఆస్కార్ నిర్వాహకులు. హాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తో పాటు దీపికా పదుకునే ఈ అరుదైన అవకాశం దక్కించుకోవడం పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ప్రతిష్ఠాత్మక కాన్స్ 2022లో జ్యూరీలో సందడి చేసిన ఈ అమ్మడు ఇప్పుడు ఆస్కార్ 2023లో ప్రెజెంటర్ గా వ్యవహరించనుంది. ఇక ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్న రెండో ఇండియన్ నటిగా దీపికా అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. 2016 లో ఆస్కార్స్ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విజేతకు అవార్డు అందజేసిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత ప్రజెంటర్ గా భారతీయ నటి దీపికా పదుకునే ఆస్కార్ వేధికపై మెరవబోతుంది. సోషల్ మీడియాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇటీవల పఠాన్ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే మూవీలో నటిస్తుంది. సెన్స్ ఫిక్షన్ గా తెరకెక్కబోతున్న ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరక్కిక్కుస్తున్నారు. ఈ మూవీతో మొదటిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది అందాల భామ దీపికా పదుకునే.
WTF DEEPIKA PADUKONE TO PRESENT AT THE 2023 OSCARS!!!!!! pic.twitter.com/jf0gGDe9Xp
— pathaani 🕊️ (@dpobsessed) March 2, 2023