ప్రభాస్.. ఆరు అడుగులు ఆజానుభావుడు. మనిషే కాదు అతని గుండె కూడా పెద్దది. సాయం కోరిక వాళ్లను లేదనకుండా చేస్తారన్న పేరుంది. అంతేకాదూ అతిధి మర్యాదలు చేయడంలో నిజంగా రాజే.. అందుకే అందరికీ డార్లింగ్ అయ్యాడు. అయితే ఓ అభిమాని కోసం ఆయన గతంలో ఓ పని చేయగా.. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
నటుడు ప్రభాస్.. ఆరు అడుగులు ఆజానుభావుడు. మనిషే కాదు అతని మనస్సు కూడా పెద్దది. సాయం కోరిక వాళ్లను లేదనకుండా చేస్తారన్న పేరుంది. అంతేకాదూ అతిధి మర్యాదలు చేయడంలో నిజంగా రాజే. విందు భోజనాలతో ఉప్పలపాటి కుటుంబం చంపేస్తుందని ఇండస్ట్రీ టాక్. ఈ విషయాన్ని ఆయనతో పనిచేసిన చాలా మంది నటీ నటులు చెబతుంటారు. అందుకే ఒక్కో హీరోకి అభిమానులున్నప్పటికీ.. ప్రభాస్‌ను అందరి హీరోల అభిమానులు ఇష్టపడుతుంటారు. అభిమానులను కలిసేందుకు ఫోటో షూట్ వంటివి చేస్తాడు. వారికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అందుకే అందరికీ డార్లింగ్ అయ్యాడు. అయితే ఓ అభిమాని కోసం ఆయన గతంలో ఓ పని చేయగా.. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇది చూసిన చాలా మంది నువ్వు దేవుడివి స్వామి అంటున్నారు. ఇంతకు ఆ వీడియోలో ఏముందంటే..?
ఈ వీడియోలో ప్రభాస్‌తో కలిసి ఉన్న అభిమాని పేరు కన్నయ్య అలియాస్ రంజిత్. ప్రస్తుతం అతడు బతికి లేడు. కారణం అతడికి ఓ రేర్ క్యాన్సర్ ఉంది. దానికి మందులు లేకపోవడంతో చివరి రోజుల్లో తన కోరికలు తీర్చాలని అతడి తల్లిదండ్రులు డిసైడ్ అయ్యారు. ఇష్టమైన ప్రాంతాలకు తీసుకెళ్లడం, ఇష్టమైన పనులు చేయడం, ఫుడ్ వండి పెట్టడం చేశారు. అయితే అతడికి ప్రభాస్ అంటే ఎంతో ఇష్టం. అతడిని కలవాలని ఉన్నట్లు తెలిపారు. కుమారుడు చివరి కోరిక తీర్చేందుకు అతని తల్లి.. దర్శకుడు పూరి జగన్నాథ్ భార్య లావణ్యకు ఫోన్ చేసి విజయం చెప్పారట. ప్రభాస్‌కు ఈ విషయాన్ని చేర్చారు లావణ్య. వెంటనే అతడిని కలిసేందుకు ఒప్పుకున్నారట ప్రభాస్. అంతేకాకుండా అతడికి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసుకున్న ఫ్రభాస్.. అతడి కోరికను ఏంటని అడిగారట.
బాహుబలి సినిమాలో వినియోగించిన ఏదైనా వస్తువు ఇవ్వాలని కన్నయ్య చెప్పడంతో.. అన్ని ఏర్పాట్లు చేశారట. కన్నయ్య, అతని తల్లిని కలిసిన ప్రభాస్.. కన్నయ్యకు ఇష్టమైన చికెన్ మంచూరియా తెప్పించి ఇచ్చారట. అలాగే బహుబలి సినిమాలో వినియోగించిన కత్తిని బహుమతిగా ఇచ్చారు. సుమారు వారితో అరగంట పాటు మాట్లాడారట. అయితే కుమారుడి కళ్లల్లో ఆనందం చూసిన తల్లి.. ఉబ్బితబ్బిబ్బు అయ్యింది. అనంతరం ప్రభాస్ కు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయారట. గత ఏడాది జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే కన్నయ్య అనారోగ్య సమస్యలతో చనిపోయారు. తన కొడుకు మరణించినప్పటికీ.. తన ఇంట్లోనే విగ్రహం కట్టించుకుంది ఆమె తల్లి.ఈ వీడియో వెనుక మ్యాటర్ తెలిసి చాలా మంది ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.