రానా తమ్ముడు అభిరామ్ పెళ్లి పీటలు ఎక్కుతున్నడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. అమ్మాయి ఎవరో కాదు వారి చుట్టాల అమ్మాయేనట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అభిరామ్ అహింస సినిమాతో తెలుగు తెరకు పరిచమైన విషయం అందరికి తెలిసిందే.
త్వరలో దగ్గుబాటి ఇంట్లో పెళ్లి సందడి మొదలు కానుందని తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతొంది. సురేష్ బాబు, చిన్న కొడుకు, రానా తమ్ముడు అయినఅభిరామ్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడని తెలుస్తొంది. దగ్గుబాటి అభిరామ్ కూడా సినిమాల్లోకీ ఎంట్రీ ఇచ్చాడు. తేజ దర్శకత్వంలో “అహింస” అనే సినిమా చేశాడు అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ నటుడిగా మంచి గుర్తింపు దక్కింది. ఇప్పుడు మళ్లీ విభిన్నమైన కథతో సిద్దమౌతున్నట్లు తెలుస్తొంది. అయితే తాజాగా అభిరామ్ పెళ్లి చేసుకుంటున్నడని ఓ వార్త సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఇక పూర్తి వివారాల్లోకి వెళ్తే..
తాజాగా అభిరామ్‌కి పెళ్లి కుదిరినట్లు తెలుస్తొంది. అమ్మాయి ఎవరో కాదు వారి బంధువుల అమ్మాయేనట. స్వయాన రామానాయుడి తమ్ముడి మనవరాలినే రానా తమ్ముడికి ఇచ్చి వివాహం చేస్తున్నట్లు సమాచారం. వివాహం జరగడం దాదాపుగా ఖాయం అయ్యిదని ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. దీంతో దగ్గుబాటి ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇది దగ్గుబాటి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పాలి. దగ్గుబాటి రానా-మిహీకా వివాహ వేడుక హైదరాబాద్‌లోని రామానాయుడు స్టుడియో వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
ఇక అభిరామ్ సినిమాల్లోకి రాకముందే వివాదాలతో ఫేమస్ అయ్యాడు. శ్రీ రేడ్డి అనే నటికి అవాకాశాలు ఇస్తా అని చెప్పి మోసం చేశాడని ఒ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. వారిద్దరు కలిసి ఉన్నా ఫోటోలను బయటపెట్టింది శ్రీ రెడ్డి. ఈ వివాదం అప్పట్లో పెద్ద దూమారమే లేపింది. అప్పటి నుండి సినిమాకు, మీడియాకు దూరంగా ఉన్నాడు. అయితే అభిరామ్ పెళ్లి జరిగితే శ్రీ రెడ్డి రియాక్షన్ ఏంటో అని ఈ విషయం తెలిసి కొంతమంది ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ దగ్గుబాటి అభిరామ్ పెళ్లి జరిగినప్పడు కచ్చితంగా శ్రీ రెడ్డి ఏదో విషయంలో ఆయాన్ని టార్గెట్ చేస్తుందని. కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.