'జబర్దస్త్' షో ద్వారా కమెడియన్స్ గా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న వారున్నారు.. అలాగే ఇదే షో ద్వారా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. అలా జబర్దస్త్ ద్వారా పేరొందిన కమెడియన్స్ లో గడ్డం నవీన్ ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న కామెడీ షోలలో ‘జబర్దస్త్’ షో ఒకటి. ఈ షో ద్వారా కమెడియన్స్ గా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న వారున్నారు.. అలాగే ఇదే షో ద్వారా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. అలా జబర్దస్త్ ద్వారా పేరొందిన కమెడియన్స్ లో గడ్డం నవీన్ ఒకరు. జబర్దస్త్ కి రాకముందు నుండే ఇండస్ట్రీలో సినిమాలు చేసిన నవీన్.. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాకే జనాలకు పరిచయమయ్యాడు. జబర్దస్త్ లో అదిరే అభి టీమ్ మెంబర్ గా రాణించిన నవీన్.. ఎంతోమంది పేరు వచ్చాక షో నుండి బయటికి వెళ్ళిపోయినా తాను కంటిన్యూ అవుతున్నాడు.
ఈ క్రమంలో గడ్డం నవీన్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు. నవీన్ మాట్లాడుతూ.. ‘అదిరే అభికి ఎంతోమంది వెన్నుపోటు పొడిచారు. ఆయన విషయంలో నేను చేసింది కూడా అలాంటిదే. అభి ఎప్పుడు కూడా కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ కమెడియన్స్ గా పరిచయం చేస్తుంటారు. వాళ్లంతా ఫేమ్ వచ్చాక అభిని వదిలేసి.. ఎవరిదారి వారు చూసుకుంటారు. చాలామంది వాళ్ళ స్వార్థం గురించి మాత్రమే ఆలోచించుకుంటారు. నాకు అభి అన్న విషయంలో నాకు అలాంటి సమస్యే ఎదురైంది. జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాక అదిరే అభి.. నన్ను కూడా వేరే కామెడీ షోకి రావాలని అడిగారు. ఆ టైంలో నేను నా స్వార్థానికి అలోచించి.. ఆయన మాటను తిరస్కరించాను. అక్కడే అభి నాపై పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. అయినా ఫైనాన్సియల్ ప్రాబ్లెమ్స్ వలనే నేను జబర్దస్త్ లో ఉండిపోవాల్సి వచ్చింది. కానీ.. అభి విషయంలో నాకింకా గిల్టీగానే ఉంది. అలాగే జబర్దస్త్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేసినవారంతా బయట హ్యాపీగా అయితే లేరు.’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నవీన్ మాటలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.