మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పక్కా మాస్ ఎంటర్టైన్ మెంట్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’. 2023లో సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని జై లవకుశ, వెంకీమామ సినిమాల ఫేమ్ దర్శకుడు బాబీ.. ఈ వాల్తేరు వీరయ్య మూవీ తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైన్ మెంట్ జానర్ లో ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తుండగా.. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా.. ఈ సినిమాలో మొదటిసారి చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జనవరి 13న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మెల్లగా స్టార్ట్ చేశారు మేకర్స్.
ఇటీవలే బాస్ పార్టీ సాంగ్ తో ఫ్యాన్స్ లో హుషారు క్రియేట్ చేసిన చిరు.. ఈసారి శృతితో ‘నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవి అవుతా’ అంటూ డ్యూయెట్ సాంగ్ తో ఊపు తెప్పించే ప్లాన్ లో ఉన్నారు. అయితే.. ఈ డ్యూయెట్ సాంగ్ కి సంబంధించి తాజాగా షూట్ కంప్లీట్ చేసుకున్న చిరు.. ఓ వీడియో ద్వారా సాంగ్ ట్యూన్ లీక్ చేశారు. ఈ సాంగ్ షూట్ ఫ్రాన్స్ లోని లెజెట్ ప్రాంతంలో జరిగినట్లు చెప్పారు. అలాగే మైనస్ ఎనిమిది డిగ్రీల చలిలో శృతిహాసన్ తో మంచులో స్టెప్పులు వేశానని.. ముఖ్యంగా ఫ్రాన్స్ లోని ఈ ప్రాంతం ఎంతో అందంగా ఉందని చెప్పారు చిరు. అలా లెజెట్ ఏరియా అందాలను ఆస్వాదిస్తూ చివరికి సాంగ్ లీక్ చేశారు.
దీంతో అభిమానులలో ఎప్పుడెప్పుడు ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తారా అనే ఆసక్తి పెరిగిపోయింది. చిరు పోస్ట్ చేసిన వీడియో చూస్తుంటే.. చిత్రయూనిట్ కష్టం కనిపిస్తోంది. అయితే.. వీడియోలో కనిపించిన విజువల్స్ అన్నీ స్వయంగా ఆయనే షూట్ చేసినట్లు తెలిపారు. ఇక ఓవైపు విజువల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ కి.. సాంగ్ లీక్ చేయడం సర్ప్రైజింగ్ గా అనిపించిందని చెప్పాలి. ప్రెజెంట్ చిరు పోస్ట్ చేసిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. మరోవైపు వాల్తేరు వీరయ్యపై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. మరి చూడాలి రేపు బాక్సాఫీస్ వద్ద వీరయ్య ఎలాంటి సందడి చేయనున్నాడో.. అదీగాక ఈ సినిమాకి పోటీగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ కూడా రిలీజ్ కానుంది. మరి చిరు లీక్ చేసిన సాంగ్ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.