మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోరుమీదున్న ఒన్ ఆఫ్ ది సీనియర్ హీరో. తాజాగా వాల్తేరు వీరయ్య తో సూపర్ హిట్ కొట్టారు మెగాస్టార్. అయితే తర్వాత ఏ సినిమాని ఒప్పుకోలేదు చిరంజీవి. దానికి ప్రధాన కారణం మెగాస్టార్ కు తగ్గ కథలు దొరక్కపోవడమే.
మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోరుమీదున్న ఒన్ ఆఫ్ ది సీనియర్ హీరో. సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్ లతో పాటుగా తాజాగా వాల్తేరు వీరయ్యతో అభిమానులను అలరించాడు మెగాస్టార్. ఇక చివరిగా చిరంజీవి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. థియేటర్ల వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే వరల్డ్ వైడ్ గా 230 కోట్ల గ్రాస్.. 130 కోట్లకు పైగా షేర్ ను ఈ చిత్రం రాబట్టింది. ఇక ఈ సినిమాతో వింటేజ్ మెగాస్టార్ ని మళ్లీ గుర్తు చేశాడు డైరెక్టర్ బాబీ. అదే కామెడి, అదే టైమింగ్.. అదే డ్యాన్స్.. అదే గ్రేస్ తో ప్రేక్షకుల మనసులను మరోసారి కొల్లగొట్టాడు చిరంజీవి.
అయితే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య తర్వాత ఏ సినిమాను ఓకే చెయ్యలేదు. ప్రస్తుతానికైతే రీమేక్ సినిమా అయిన భోళా శంకర్ మాత్రమే మెగాస్టార్ చేతిలో ఉంది. ఇక ఇండస్ట్రీలో ఇద్దరు ప్రొడ్యూసర్స్ డీవివి దానయ్య, ఎన్వీ ప్రసాద్ లకు సినిమా చేస్తానని మాటిచ్చారు మెగాస్టార్. అయితే ఇప్పుడు మెగాస్టార్ కు కథ దొరకడమే కష్టంగా మారిపోయింది. ఇక మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాక.. 60 సంవత్సరాల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నారు. వరుస బెట్టి చిత్రాలు చెయ్యడానికి చిరంజీవి రెడీగా ఉన్నప్పటికీ పరిశ్రమలో మెగాస్టార్ కు తగ్గ కథలు రాయగల రచయితలు మాత్రం దొరకడంలేదు. ఇప్పుడే కాదు గత కొంత కాలంగా టాలీవుడ్ లో రచయితల కొరత వేధిస్తూనే ఉంది.
అయితే గతంలో ఈ పరిస్థితి లేదు. అప్పట్లో ప్రత్యేకంగా కథలు రాయడానికంటూ రచయితలు ఉండేవారు. సత్యానంద్, పరుచూరి బ్రదర్స్, తనికెళ్ల భరణి, పోసాని, కోరటాల శివ, త్రివిక్రమ్ లాంటి వారు ప్రత్యేకంగా కథలను సిద్దం చేయడంలోనే మునిగిపోయేవారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితి వేరేగా ఉంది. ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు తమ కథను తామే రాసుకుని తెరకెక్కించే పనిలో పడ్డారు. దాంతో గతంలోలా కేవలం కథలు రాసే రచయితలు కనిపించడం లేదు. అయితే ఇప్పుడిప్పుడే యంగ్ డైరెక్టర్లు సీనియర్ హీరోలతో పనిచెయ్యడం మెుదలు పెట్టారు.
ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ తో హిట్ మూవీ దర్శకుడు శైలేష్ కొలను ‘సైంధవ్’ తీస్తుండగా.. అనిల్ రావిపూడి, బాలయ్యతో ఓ సినిమా చేస్తున్నారు. ఇక మెగాస్టార్ కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నప్పటికీ చిరంజీవికి నచ్చిన కథలు, నప్పిన కథలు మాత్రం దొరకడం లేదు. అయితే టాలీవుడ్ లో టాలెంటెడ్ రైటర్లకు, డైరెక్టర్లకు కొదవలేదనేది కాదనలేని వాస్తవం. ఇక నిర్మాతలు అయిన డీవివి దానయ్య, ఎన్వీ ప్రసాద్ ఇద్దరిలో ఎవరు ముందు కథను సిద్దం చేసుకుంటే వారికే మెగాస్టార్ అవకాశం ఇచ్చే ఛాన్స్ లు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదంతా ఒకెత్తు అయితే చిరంజీవి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా సినిమా చేస్తాడని కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే హీరోల ఇమేజ్ ను బట్టి క్యారెక్టర్స్ రాయగల పూరి.. మెగాస్టార్ తో సినిమా చెయ్యాలని అభిమానులు కోరుకుంటున్నారు. చిరంజీవి సైతం పూరితో సినిమా చెయ్యాలని చూస్తోన్నట్లు గతంలో పలుమార్లు చెప్పుకొచ్చారు. మరి కథల కోసం ఎదురుచూస్తున్న మెగాస్టార్ కోసం.. కథ ఇచ్చే మెునగాడు ఎవరో వేచి చూడాలి. జోరుగా సినిమాలు చేస్తు మంచి ఊపుమీదున్నమెగాస్టార్ కు తగ్గట్లు కథలు దొరకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.