మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పగానే అదిరిపోయే డ్యాన్సులు, రప్ఫాడించే ఫైట్స్, అద్భుతమైన యాక్టింగే గుర్తొస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే హీరోల్లో చిరు కచ్చితంగా టాప్ లో ఉంటారు. మరీ ముఖ్యంగా 80, 90 దశకంలో మాస్ ఆడియెన్స్ ఆకలి తీర్చిన హీరో మెగాస్టారే. ఇక 1991లో చిరు హీరోగా చేసిన ‘గ్యాంగ్ లీడర్’ అయితే ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచిపోతుంది. గత కొన్ని నెలల నుంచి రీ రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ‘గ్యాంగ్ లీడర్’ని కూడా ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ అది కాస్త ఇప్పుడు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా థియేటర్లలోకి వచ్చారు. వరల్డ్ వైడ్ రూ. 200 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, తన స్టామినా ఏంటో చూపించారు. ఈ సినిమాలో వింటేజ్ చిరులోని కామెడీ, డ్యాన్స్, ఫైట్స్ చూసి చాలామంది తెగ ఆనందపడిపోయారు. అలాంటిది చిరు అప్పట్లో చేసిన ‘గ్యాంగ్ లీడర్’లో ఇంతకు మించి అనే రేంజులో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని గానీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ చూస్తే మెంటలెక్కిపోయేవారు. కానీ ఇప్పట్లో అది జరిగేలా కనిపించడం లేదు.
జనవరిలో ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ కావడంతో చిరు అభిమానుల కోసం.. ఫిబ్రవరి 11న ‘గ్యాంగ్ లీడర్’ మూవీని రీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల దీన్ని కాస్త వాయిదా వేసినట్లు తెలుస్తోంది. డిసెంబరు 31న కూడా ఇలానే ప్లాన్ చేశారు కానీ అది కుదరలేదు. ఇప్పుడీ విషయం తెలిసి పలువురు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. బాస్ వింటేజ్ సినిమాని థియేటర్లలో చూసే ఛాన్స్ మిస్ అయ్యామే అని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా సరే ‘గ్యాంగ్ లీడర్’ సినిమా రీ రిలీజ్ అయ్యుంటే ఇప్పటి జనరేషన్ కి కూడా చిరు అంటే ఏంటో తెలిసి ఉండేది. మరి చిరు సినిమా రీ రిలీజ్ కాకపోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.