మెగాస్టార్ చిరుకు బాలయ్యకు వార్నింగ్ ఇచ్చారు. అది కూడా స్టేజీపై. ఇది వినగానే మీరు కచ్చితంగా షాకై ఉంటారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందో తెలుసా?
టీమిండియాకు ఐపీఎల్ ఎలానో.. సినిమా స్టార్స్ కు సీసీఎల్ అలా. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పేరుతో గుర్తింపు తెచ్చుకున్న ఈ టోర్నీ దాదాపు ప్రతి ఏడాది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడంటే ఓ మాదిరిగా క్రేజ్ ఉంది. అప్పట్లో అయితే ఫ్యాన్స్.. స్టార్ హీరోల మ్యాచుల కోసం తెగ వెయిట్ చేసేవారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లోనే అప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కెప్టెన్లుగా నాలుగు జట్లు ఉండేవి. ఆయా టీమ్ ల మధ్య పోటీ కూడా అలానే ఉండేది. ఇప్పుడు అందుకు సంబంధించిన ఓ వీడియోనే వైరల్ గా మారడంతో.. మరోసారి దాని గురించి నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘భరత్ అను నేను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన హీరో మహేష్ బాబు.. ‘మేము మేము బాగానే ఉంటాం’ అని హీరోల మధ్య బాండింగ్ గురించి చెప్పుకొచ్చాడు. చాలామంది అభిమానులు.. స్టార్ హీరోలకు ఒకరంటే ఒకరికి పడదని అనుకుంటారు. కానీ వాళ్ల మధ్య ఎంత చక్కటి ఫ్రెండ్ ఫిష్ ఉందనేది కొన్ని కొన్ని ఈవెంట్స్ చూసినప్పుడు తెలుస్తుంది. అలాంటిదే సీసీఎల్ టోర్నీ. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే నటీనటులు.. ఈ క్రికెట్ టోర్నీ కోసం జట్లుగా ఏర్పడి అప్పట్లో పోటీపడ్డారు. స్పాన్సర్ షిప్, టికెట్స్ ద్వారా వచ్చిన డబ్బుని ఏదైనా మంచి పనికోసం ఉపయోగించేవారు. అయితే మ్యాచులు జరుగుతున్న టైంలో హీరోల మధ్య ఫన్నీ వార్స్ కూడా జరిగేవి.
టైం సరిగా గుర్తులేదు గానీ టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా హోస్ట్ సాయికుమార్.. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలను తమ తమ టీమ్ ల గురించి చెప్పమని కోరారు. దీంతో ఫస్ట్ వచ్చిన నాగార్జున, తమ కింగ్స్ జట్టు విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వెంటనే వచ్చిన చిరు.. తమ చీతాస్ జట్టు కప్ గెలిచేస్తుందని అన్నారు. అ పక్కనే ఉన్న బాలయ్య.. తమ జట్టు లయన్స్ గురించి చెబుతూ.. అడవికి రాజు ఎవరో తెలుసు కదా అని తమ జట్టే గెలుస్తుందని చిరుతో ఫన్నీ వాగ్వాదానికి దిగారు. ఇక లాస్ట్ లో వచ్చిన వెంకీ.. స్టేజీపై కాదు గ్రౌండ్ లో మాట్లాడుతాం అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలా ఒకే వేదికపై బాలయ్య-చిరు మధ్య ఫన్నీ వార్ జరగడం, అందరి మధ్య అద్భుతమైన బాండింగ్ ఉండటం చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేస్తున్నవాళ్లు.. ఈ వీడియో చూసైనా సరే మారాలి అని అంటున్నారు. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.