టాలీవుడ్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మారింది అనసూయ భరద్వాజ్. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రంగస్థలం మూవీతో నటిగా సూపర్ క్రేజ్ దక్కించుకున్న అనసూయ.. బుల్లితెరపై గ్లామరస్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. అయితే.. నటిగా కెరీర్ ప్రారంభించిన తర్వాత అనసూయ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంటుంది.
ఇక ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో నటించిన అనసూయ.. తాజాగా చిరు సరసన మరో ప్రాజెక్ట్ లో కనిపించి సందడి చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్ ఓ కమర్షియల్ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. శుభగృహ రియల్ ఎస్టేట్ వారి కమర్షియల్ యాడ్ కోసం సుకుమార్ – చిరు జతకట్టారు. ఈ యాడ్ ఫిల్మ్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.ఇక ఈ యాడ్ లో చిరంజీవితో పాటు అనసూయ, నటి ఖుష్బూ కనిపించారు. అయితే.. చిరు పక్కన అనసూయ కనిపించడంతో ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. ఈ యాడ్ లో చిరు భార్యగా ఖుష్బూ నటించగా, రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా అనసూయ కనిపించింది. మెగాస్టార్ కూడా ట్విట్టర్ లో సుకుమార్ తో కలిసి షూటింగ్ లో దిగిన పిక్స్ షేర్ చేశారు. మరోవైపు అనసూయ మరోసారి మెగా ఛాన్స్ భలేగా కొట్టేసిందిగా అంటున్నారు నెటిజన్లు. మరి చిరు, అనసూయ నటించిన ఈ యాడ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.