గతంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. ఇసుక వల్ల బైక్ స్కిడ్ అవడంతో తేజ్ జారిపడి గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు సాయి ధరంతేజ్ ను అపోలో హాస్పిటల్ లో చేర్పించారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధనలు చేశారు. వారి ప్రార్ధనలతో సాయిధరమ్ తేజ్ కోలుకోని సాధారణ జీవితంలోకి వచ్చాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసింది. తాజాగా హీరో సాయిధరమ్ తేజ పై త్వరలో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
హీరో సాయిధరమ్ తేజ్ కు జరిగిన రోడ్డు ప్రమాందపై కేసు నమోదు చేసి, అతడు కోలుకున్నాక నోటీసులు ఇచ్చామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.”91 CRPC కింద తేజ్ కు నోటీసులు జారీ చేశాం. లైసెన్స్, బైక్ ఆర్ సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ డ్యాకుమెంట్లు వివరాలు ఇవ్వాలని అడిగాం, కానీ అతని నుంచి ఎలాంటి వివరణ రాలేదు. త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం” అని సీపీ తెలిపారు.