తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ కన్నుమూసిన విషయం తెలిసిందే. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు గడవక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చలపతిరావు గుండెపోటుతో ఆయన స్వగృంలో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ నిజ జీవితంలో చలపతిరావు ఎంతో జాలీగా, అందరితో జోక్స్ వేసుకుంటూ సంతోషంగా ఉండేవారని అంటారు. ఇండస్ట్రీలో చలపతిరావు చిరునవ్వు వెను ఎంతో విషాదం దాగి ఉందని అంటుంటారు.
చలపతిరావు క్రిష్ఱా జిల్లా బలిపర్రు గ్రామంలో 1944, మే 8న చలపతిరావు జన్మించారు. 1966లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూడాచారి 116 మూవీలో 22 ఏళ్లకే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో దాదాపు 1200 చిత్రాల్లో నటించారు. అంతేకాదు నిర్మాతగా 7 చిత్రాలు నిర్మించారు. ఆయన చివరి దశలో తండ్రి, తాత పాత్రల్లో నటించారు. ఆయనకు ఒక కొడుకు, ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు కూతుళ్లు అమెరికాలో స్థిరపడ్డారు. తన 55 ఏళ్ల సుధీర సినీ ప్రయాణంలో ఎన్నో విషాదాలు, ఆనందాలు చూశారు చలపతిరావు.
చలపతిరావు కుటుంబం చెన్నైలో ఉండగా ఆయన సతీమణి ఇందుమతి అగ్నిప్రమాదానికి గురై మూడు రోజులు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తర్వాత కుటుంబ సభ్యులు, సన్నిహితులు చలపతిరావు ని రెండో వివాహం చేసుకోమని చెప్పారు. కానీ ఆయన మాత్రం తన పిల్లల భవిష్యత్ కోసం జీవితంలో మరో పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నారు. ఒకసారి ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు పది నెలల వరకు ఆయన వీల్ చైర్ కే పరిమితం అయ్యారు.. అలాగే చూపు కూడా మసకబారడంతో ఇక ఇండస్ట్రీకి దూరం అవుతానా అని ఎంతో మదనపడ్డారట. తర్వాత కోలుకొని మళ్లీ సినిమాల్లో నటించారు.
చలపతిరావు ఎప్పుడూ కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారని అంటారు.. కానీ ఒక సందర్భంలో ఆయన మహిళలపై చేసిన సంచలన వ్యాఖ్యలు నెగిటీవ్ గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో పెద్ద ఎత్తున మహిళా సంఘాల నుంచి ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇండస్ట్రీ నుంచి కూడా ఆయనపై విమర్శలు వచ్చాయి. ఆయనపై వస్తున్న నెగిటీవ్ ని భరించలేక ఆతహత్య చేసుకోవాలని అనుకున్నారట.. కానీ అదే సమయంలో చలపతిరావు కుమారుడు నటుడు, డైరెక్టర్ రవిబాబు ధైర్యం చెప్పి ఆయనను దగ్గరుండి చూసుకున్నారట.. కొంతకాలం తర్వాత ఆ విషయం మర్చిపోయారట చలపతిరావు. ఆయన చివరి చిత్రం నాగార్జున, నాగ చైతన్య కలిసిన నటించిన బంగార్రాజు మూవీ. చలపతిరావు మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం ప్రకటిస్తున్నారు.