ఖైదీ సినిమాతో లోకేష్ కనకరాజ్ దశ మారిపోయింది. సినిమా సూపర్ హిట్ అవ్వటంతో తమిళంలో టాప్ డైరెక్టర్‌గా మారిపోయారు. తర్వాత వచ్చిన విక్రమ్ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సొంత చేసుకుంది. దేశ వ్యాప్తంగా లోకేష్ పేరు మారుమోగుతోంది.
ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆయన పేరు మారుమోగుతోంది. తీసింది ఐదు సినిమాలే అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. విక్రమ్ సినిమాతో 400 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయారు. లోకేష్ ప్రస్తుతం ఇసయ దళపతి విజయ్ హీరోగా ‘లియో’ అనే యాక్షన్ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరావేగంగా జరుగుతోంది. లోకేష్‌కు సహాయంగా పదుల సంఖ్యలో అసిస్టెంట్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. లోకేష్ అసిస్టెంట్లలో విష్ణు ఎడవన్ కూడా ఒకరు. తాజాగా, విష్ణుపై పోలీసు కేసు నమోదైంది.
ఓ యువతి తనను విష్ణు మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు యువతి పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. విష్ణు ఎడవన్ ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. అతడు పలు లోకేష్ సినిమాలకు పాటలు కూడా రాశాడు. సినిమాల్లో ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న విష్ణు గత కొన్ని సంవత్సరాల నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరు తమ ప్రేమ గురించి రెండు కుటుంబాల్లో చెప్పారు. ఇరు కుటుంబాల వారు వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. పెళ్లికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఎలాగైనా పెళ్లి జరుగుతోంది కదా అని చెప్పి.. విష్ణు ఆమెతో శారీరకంగా కలిశాడు. అయితే, రోజులు గడుస్తున్న కొద్ది అతడిలో మార్పు వచ్చింది. పెళ్లి ప్రస్తావన తెస్తే.. తప్పించుకుని తిరుగుతున్నాడు. విష్ణు కారణంగా ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం చెప్పినా కూడా అతడు పట్టించుకోవటం లేదు. దీంతో సదరు బాధిత యువతి పోలీసులను సంప్రదించింది. విష్ణుపై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The Energy⚡ The Aura 💥 The Vibe 💥
Excited about @Suriya_offl sir Entering Into the World of #vikram @Dir_Lokesh @ikamalhaasan @VijaySethuOffl @anirudhofficial @RKFI #fahadfaasil #VikramFromJune3 https://t.co/mUMQ6YEZcE— Vishnu Edavan (@VishnuEdavan1) May 18, 2022