ఇండస్ట్రీలో వరుస విషాదాలు ప్రేక్షకులను కలచివేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ నటి సోనాలి చక్రవర్తి మరణవార్తను మరవకముందే మరో ప్రముఖ నటుడు, థియేటర్ డైరెక్టర్ ఉపిందర్ ఖాషు కన్నుమూశారు. ఈయన నటుడిగానే కాకుండా బ్రాడ్ కాస్టర్ గా ఎనలేని పేరు సంపాదించుకున్నారు. అయితే.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉపిందర్ ఖాషు.. గురుగ్రామ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఈయన వయసు 70 సంవత్సరాలు. కాగా ఈయనకు భార్య గిరిజా ఖాషు వాటల్(ఆల్ ఇండియా రేడియో బ్రాడ్ కాస్టర్).. ఇంకా ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు ఉన్నారు.
ఇక శ్రీనగర్ లో పుట్టిపెరిగిన ఉపిందర్ ఖాషు.. 1990ల కాలంలో తీవ్రవాదుల బెదిరింపుల కారణంగా అక్కడినుండి ఢిల్లీకి వలస వెళ్లారు. అయితే.. ఢిల్లీకి వలస వెళ్ళకముందు కాశ్మీర్ లో ఉర్దూ, కాశ్మీరీ వార్తలు చదివేవారు. 1980ల మధ్యలో టెలి-సీరియల్ ‘చౌరహా'(క్రాస్ రోడ్)లో కీలకపాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సీరియల్ లో పోషించిన ఖాషు క్యారెక్టరే తర్వాత ఆయనకు ఇంటిపేరుగా ,మారిపోయింది. అనంతరం 1987లో దూరదర్శన్ లో ప్రసారమైన పాపులర్ సీరియల్ ‘గుల్ గుల్షన్ గుల్ఫామ్’ ద్వారా ఉపిందర్ నేషనల్ వైడ్ ఫేమ్ దక్కించుకున్నారు. ఈ సీరియల్ కాశ్మీరీ పండిట్స్, ముస్లింల మధ్య స్నేహాన్ని గురించి వివరిస్తుంది.
ఆ తర్వాత ఉపిందర్ ఖాషు.. ముంబై, ఢిల్లీ, జమ్మూలాంటి ప్రదేశాలలో కాశ్మీరీ నాటకాలను రాయడమే కాకుండా దర్శకత్వం వహించారు. అలా థియేటర్ డైరెక్టర్ గా మారిన ఉపిందర్ ఖాషు.. రంగస్థలం, రేడియో, టీవీ సీరియల్స్ లతో పాటు సినిమాలలో కూడా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. నటన పరంగా ఉపిందర్ వందలాది నాటకాలు, సీరియల్స్, కొన్ని సినిమాలలో నటించారు. అలాగే ఉపిందర్ తెరకెక్కించిన చివరి చిత్రం ‘వాసా'(Wasa) రెండేళ్ల క్రితం జమ్మూలో ప్రదర్శించడం జరిగినట్లు సమాచారం. బ్రాడ్ కాస్టర్ గా, థియేటర్ డైరెక్టర్ గా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉపిందర్ ఖాషు మృతిపట్ల ఇండస్ట్రీ ప్రముఖులు, సినీ ప్రేక్షకులు సంతాపం తెలియజేస్తున్నారు.
Your heavenly journey has left a void in #Kashmiri theatre for you, #upinderKhashu will be always remembered for your cheerful nature. Your powerful roles will always remain etched to our memory. My condolences to @rakakhashu https://t.co/pqekiCirtY pic.twitter.com/oKS1r44clh
— sumir kaul (@sumirkaul) November 1, 2022