ఇండస్ట్రీలో వరుస విషాదాలు ప్రేక్షకులను కలచివేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ నటి సోనాలి చక్రవర్తి మరణవార్తను మరవకముందే మరో ప్రముఖ నటుడు, థియేటర్ డైరెక్టర్ ఉపిందర్ ఖాషు కన్నుమూశారు. ఈయన నటుడిగానే కాకుండా బ్రాడ్ కాస్టర్ గా ఎనలేని పేరు సంపాదించుకున్నారు. అయితే.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉపిందర్ ఖాషు.. గురుగ్రామ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఈయన వయసు 70 సంవత్సరాలు. కాగా ఈయనకు భార్య గిరిజా […]