సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమాలో కట్టప్పగా నటించి అందరి మెప్పును పొందారు. తర్వాత ఆయన పేరు కట్టప్పగానే మిగిలిపోయింది. టాలీవుడ్‌లో ప్రముఖ హీరోలకు తండ్రి పాత్రలు పోషించి గుర్తింపు పొందారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో బాహుబలి కట్టప్పగా నటించిన సత్యరాజ్ అందరికి సుపరిచితులు. ‘బాహుబలి’ సినిమాలో రాజుతోనే మామా అని పిలిపించుకున్న సత్యరాజ్ తెలుగు సినిమాల్లో తండ్రి పాత్రలు చాలా పోషించారు. ఆయన అసలు పేరు రంగరాజ్ సుబ్బయ్య. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో మొత్తం 200 కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో బాహుబలి, మిర్చి, శంఖం మొదలైన చిత్రాల్లో నటించారు. సత్యరాజ్‌కు నటనపై ఆసక్తి ఎక్కువ. సినిమాల్లో నటించుటకు అతని తల్లి మొదట ఒప్పుకోలేదు. అయినా 1976 నుంచి సినీరంగ ప్రవేశం చేశాడు. దీనికోసం కోయంబత్తూరు వదిలి చెన్నైలోని కోడంబాక్కం వెళ్లాడు. అయితే తాజాగా సత్యరాజ్ ఇంట విషాదం నెలకొంది. సత్యరాజ్ తల్లి నతంబాల్ మరణించారు. ఆమె మరణంతో సత్యరాజ్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
నటుడు సత్యరాజ్ ఇంట్లో తీవ్రమైన విషాదం చోటుచేసుకుంది. సత్యరాజ్ తల్లి నతంబాల్ మృతిచెందారు. ప్రస్తుతం ఆమెకు 94 సంవత్సరాల వయస్సు. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతుంది. నిన్న రాత్రి తన స్వగృహంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హైదరాబాద్ షూటింగ్‌లో ఉన్న సత్యరాజ్ తల్లి మరణ వార్త విని హుటాహుటిన కోయంబత్తూర్‌కు బయలుదేరారు. నతంబాల్‌కు మొత్తం ముగ్గురు పిల్లలు. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. అబ్బాయి సత్యరాజ్, కుమర్తెలు కల్పన, రూప. సత్యరాజ్‌కు తన తల్లిపై చాలా ప్రేమ. ఆమెకు సత్యరాజ్ నటించిన సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టపడేదని చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు.
సత్యరాజ్ మాతృవియోగం చెందడం అందరికి బాధకలిగించింది. సత్యరాజ్ తల్లి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. కోలీవుడ్ నటుడు, ఎమ్మెల్యే అయిన ఉదయనిధి స్టాలిన్, తన సంతాపాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘నటుడు సోదరుడు శ్రీ సత్యరాజ్ తల్లి నతంబాల్ మరణవార్త విని బాధపడ్డాను. అమ్మయ్యర్ మృతి పల్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. సోదరుడు సత్యరాజ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలయజేస్తున్నాను’ అని ట్వీట్ చేశాడు.
సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమాలో కట్టప్పగా నటించి అందరి మెప్పును పొందారు. తర్వాత ఆయన పేరు కట్టప్పగానే మిగిలిపోయింది. టాలీవుడ్‌లో ప్రముఖ హీరోలకు తండ్రి పాత్రలు పోషించి గుర్తింపు పొందారు. ఆయన కొడుకు శిబి సత్యరాజ్ కూడా కోలీవుడ్ హీరోగానే స్థికపడ్డారు. టాలీవుడ్‌లోని ప్రముఖులు కూడా సత్యారాజ్ మాతృవియోగానికి సానుభూతి తెలియజేశారు.