సీరియల్ లోకి సినీ తారలు వస్తున్నారంటే.. ఫ్యాన్స్ లో ఎక్సయిట్ మెంట్ ఎలా ఉంటుందో తెలుసు కదా! హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇటీవల ఓ పాపులర్ సీరియల్ షూటింగ్ లో సందడి చేసిన ట్రెండ్ అవుతోంది.
బుల్లితెర అనగానే అందరికి ముందుగా డైలీ సీరియల్స్ గుర్తుకు వస్తాయి. సీరియల్స్ కంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా లేడీస్ లో ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. అంటే.. బయటకి చెప్పకపోయినా మగవారిలో కూడా డైలీ సీరియల్స్ కి కొంతశాతం ఫ్యాన్స్ ఉంటారు. అయితే.. సీరియల్ అంటే రెగ్యులర్ గా కొందరి ముఖాలే రిపీటెడ్ గా కనిపిస్తుంటాయి. అదే సీరియల్ లోకి సినీ తారలు వస్తున్నారంటే.. ఫ్యాన్స్ లో ఎక్సయిట్ మెంట్ ఎలా ఉంటుందో తెలుసు కదా! ఇటీవల టాలీవుడ్ హాస్యబ్రహ్మ బ్రహ్మానందం.. మరో స్టార్ కమెడియన్ ఆలీతో కలిసి ఓ పాపులర్ సీరియల్ షూటింగ్ లో సందడి చేసిన వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
గుప్పెడంత మనసు.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు. ముఖ్యంగా ఆడవారిలో ఈ సీరియల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు. రిషి – వసుధార లవ్ స్టోరీ.. వారి మధ్య లవ్ సీన్స్.. ఇగోస్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే వేరే సీరియల్స్ చూసినా చూడకపోయినా.. గుప్పెడంత మనసుని తప్పకుండా చూస్తుంటారు. ఈ సీరియల్ ని లెజెండ్ బ్రహ్మానందం, వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఇష్టంగా చూస్తారని ఆయనే స్వయంగా చెప్పడం విశేషం. అదీగాక సీరియల్ షూటింగ్ స్పాట్ లో మెయిన్ క్యారెక్టర్స్ అందరితో కలిసి సీరియల్ ని, వారి యాక్టింగ్ ని కొనియాడారు బ్రహ్మానందం.
బ్రహ్మానందంతో పాటు నటుడు ఆలీ కూడా చాలాసేపు సీరియల్ టీమ్ తో ముచ్చటించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. సీరియల్ లో నటించిన ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని, డైరెక్టర్ వర్క్ ని మెచ్చుకున్నారు. దీంతో లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందమే.. స్వయంగా తమ షూటింగ్ సెట్ కి వచ్చి పలకరించి, కాసేపు మాట్లాడటం అనేది గొప్పగా ఫీల్ అవుతున్నారు గుప్పెడంత మనసు టీమ్. ప్రెసెంట్ బ్రహ్మానందం, ఆలీ ఇద్దరూ గుప్పెడంత మనసు టీమ్ తో ముచ్చటించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. మరి బ్రహ్మానందం ఎప్పుడూ కూడా ఇలా ఓ సీరియల్ టీమ్ ని షూటింగ్ సెట్ కి వచ్చి అభినందించడం చూసి ఉండరు. ఆ లక్ గుప్పెడంత మనసు టీమ్ కి దక్కిందని చెప్పవచ్చు. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.