ఎన్నో అంచనాలతో గతవారం రిలీజైన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్-2. భారీ కలెక్షన్స్ తో విజయవంతగా దూసుకెళ్తుంది. ఇదే సమయంలో థియేటర్ లో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ ఆడుతోంది. అయినప్పటికీ కేజీఎఫ్ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తనకున్న శక్తిని అంత KGF-2 సినిమాపై ప్రయోగించినట్లుగా ఉంది. ఈ రెండు సౌత్ ఇండియా చిత్రాలు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించాయి. పలు దక్షిణాది చిత్రాలు.. సౌత్ తో పాటు నార్త్ లోను మంచి వసూలు సాధించాయి. బాలీవుడ్ మూవీ డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్ల మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. దీంతో KGF,RRR చిత్రాలతో పాటు సౌత్ సినిమాలను చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ ఎగ్జిబిటర్ మనోజ్ దేశాయ్ దక్షిణాది చిత్రాలను ఆకాశానికెత్తేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “ఐపీఎల్ ఫీవర్ కొనసాగుతున్న తరుణంలో ఒక సినిమా అంతకు మించిన హైప్ తో భారీ స్థాయిలో కాసుల వర్షం కురిపించింది అంటే అటువంటి ఘనత కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రానికి సాధ్యమయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే సౌత్ ఇండియా సినిమాలు లేకపోతే చాలా మంది థియేటర్లు క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది” అంటూ సౌత్ ఇండస్ట్రీ పై ప్రశంసలు కురిపించారు. కరోనా పాండమిక్ తరువాత వచ్చిన సౌత్ మూవీస్ మంచి విజయం సాధించడం వలనే బాలీవుడ్ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్ మరియు థియేటర్ యాజమాన్యాలు లాభాలు అందుకున్నారని మనోజ్ దేశాయ్ అన్నారు.
బాలీవుడ్ లో మంచి సినిమాలు లేని తరుణంలో సౌత్ నుంచి పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 వంటి చిత్రాలు వంచి తమకు బాగా లాభాలు తెచ్చిపెట్టాయి. బాలీవుడ్ సినిమాలు సరైన సక్సెస్ లేక విలవిలలాడుతున్న తరుణంలో కేజీఎఫ్, ఆర్ ఆర్ ఆర్, పుష్ప లాంటి సౌత్ చిత్రాలు మంచి విజయాని సొంతం చేసుకున్నాయి.ఈ చిత్రాలకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ మనోజ్ దేశాయ్ ఆనందం వ్యక్తం చేశారు.
ఒకప్పుడు సౌత్ ఇండియా మూవీస్ అంటే బాలీవుడ్ లో చిన్న చూపు ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. దేశ వ్యాప్తంగా సౌత్ మూవీస్ హావా కొనసాగుతోంది. ఈ విషయంలో బాలీవుడ్ పంపిణీదారులు ఇలా సౌత్ సినిమాలని పొగడటం అంటే నిజంగా గర్వించదగ్గ విషయమే. మరి.. బాలీవుడ్ ప్రముఖులు దక్షిణాది చిత్రాలపై ప్రశంసల వర్షం కురిపించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియలజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.