ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా కూడా మారింది. కాగా ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన దాడిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. ముందుగా పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లలేదనే కారణంతో పునీత్ అభిమానులు దాడి చేసిరంటూ వార్తలు వచ్చాయి.
కానీ అది వాస్తవం కాదని దాడి చేసిన వ్యక్తి మొదటగా విజయ్ ని సెల్ఫీ అడిగితే దానికి ఆయన నిరాకరించినందుకు అతడు కోపంతో అలా వెనకాల నుంచి తన్నాడని తెలిపారు. అయితే ఇదే అంశంపై తాజాగా బీజేపీ నేత సంచనల ప్రకటన చేశారు. సేతుపతిపై దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. హిందూ వాది అర్జున్ సంపత్ పేరిట మక్కల్ కట్చి సంస్థ ట్వీట్ చేశారు. విజయ్ పై దాడి చేసిన వ్యక్తికి ప్రోత్సాహం కింద ఒక్కో తన్నుకు రూ. 1001 బహుమతి ఇస్తామంటూ సంచలన ప్రకటన చేసింది. తాజాగా చేసిన ఈ ట్వీట్ పై తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇలా విజయ్ పై కామెంట్ చేయటంపై ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Arjun Sampath announces cash award, for kicking actor Vijay Sethupathi for insulting Thevar Ayya.
1 kick = Rs.1001/- for any one who kicks him, until he apologises. pic.twitter.com/Fogf7D9V7S
— Indu Makkal Katchi (Offl) 🇮🇳 (@Indumakalktchi) November 7, 2021
