విజయ్ సేతుపతికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరూ కూడా ప్రస్తుతం తమిళ సినిమాలు చేస్తూ ఉన్నారు. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్యాన్ ఇండియా యాక్టర్‌గా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా.. పాత్ర నచ్చితే.. విలన్, సెకండ్ హీరో రోల్స్ కూడా చేస్తున్నారు. తన నటనతో దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఇక, విజయ్ సేతుపతి వ్యక్తిగత విషయాల్లోకి వెళితే.. విజయ్ సేతుపతి సినిమాల్లోకి రావటానికి ముందు దుబాయ్‌లో పని చేసేవారు.
ఆ సమయంలోనే ఆన్‌లైన్ ద్వారా జెస్సీ అనే యువతితో ప్రేమలో పడ్డారు. ఇండియాకు వచ్చిన తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2003 సంవత్సరంలో వీరికి పెళ్లయింది. ఈ జంట ఓ అబ్బాయి, అమ్మాయికి జన్మనిచ్చింది. అబ్బాయి పేరు సూర్య కాగా.. అమ్మాయి పేరు శ్రీజ. ఈ ఇద్దరూ కూడా నటులే కావటం విశేషం. సూర్య, శ్రీజలు తండ్రి స్పూర్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సూర్య తండ్రి హీరోగా నటించిన ‘నానూ రౌడీ దా’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో తండ్రి చిన్నప్పటి పాత్రను చేశారు.
తర్వాత విజయ్ సేతుపతి నటించిన సింధుబాద్, విడుదలై సినిమాల్లో నటించారు. ‘నాడు సెంటర్’ అనే ఓ తమిళ వెబ్ సిరీస్‌లోనూ సూర్య భాగం అయ్యారు. ఇక, విజయ్ సేతుపతి కూతురు విషయానికి వస్తే.. శ్రీజ కూడా తన నటనా ప్రస్తానాన్ని రెండేళ్ల క్రితమే మొదలుపెట్టింది. ఆమె కూడా తండ్రి హీరోగా నటించిన ‘ముగిల్’ సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా తండ్రి బాటలోనే ఆ ఇద్దరు పిల్లలు కూడా సేతుపతి నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.