బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ ఆస్పత్రిలో చేరిన ఫొటో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఆ వివరాలు..
సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. చాలా మంది సామాన్యులు సెలబ్రిటీ హోదా సంపాదించుకున్నారు. వీరిలో ముందు వరుసలో ఉంటుంది అషూ రెడ్డి. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి మరింత మంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ 1లో కూడా పాల్గొంది. నటిగా కన్నా కూడా బోల్ఢ్ పోస్ట్‌లు, ఇంటర్వ్యూలు, స్కిన్ షోతో తెగ రచ్చ చేస్తోంది. నిత్యం వెకేషన్‌లకు వెళ్తూ.. ఫొటోలు షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాక తన డ్రెస్సింగ్ మీద కామెంట్స్ చేసే వారికి సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు కూడా ఇస్తుంది. ఇక తాజాగా అషూ రెడ్డి చేసిన పోస్ట్ ఒకటి వైరలవుతోంది. దీనిలో బిగ్ బాస్ బ్యూటీ ఆస్పత్రిలో ఉండటంతో.. అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు అషూ రెడ్డికి ఏమైంది అంటే..
నిత్యం ప్రయాణాలు చేస్తూ.. చలాకీగా తిరుగుతూ ఉండే అషూ రెడ్డి.. తాజాగా ఆస్పత్రిలో చేరింది. చేతికి సెలైన్ పైప్‌తో, ఆస్పత్రి బెడ్ మీద ఉన్న అషూ రెడ్డి ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజనులు.. అషూ రెడ్డికి ఏమైంది.. ఎందుకు ఇలా ఆస్పత్రిలో చేరింది.. ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. అభిమానుల ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. తాను ఇప్పుడు త్వరగా కోలుకుంటున్నాను.. కంగారేం లేదు అని చెప్పుకొచ్చింది అషూ రెడ్డి. కానీ సమస్య ఏంటో తెలపలేదు అషూ రెడ్డి.
అషూ రెడ్డి ఈ మధ్య ఎక్కువగా వెకేషన్స్ అంటూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులు దుబాయ్‌లో ఉన్నాను అంటూ పోస్ట్‌లు పెడుతుంది. ఆ వెంటనే అమెరికా అంటుంది. ఇలా ఎప్పుడు చూసిన వెకేషన్స్ అంటూ తిరుగుతూనే ఉంటుంది. మొన్నటి వరకు అషూ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్‌లు కలిసి దుబాయ్‌లో సందడిచేశారు. రాహుల్ చేసిన వన్ మినిట్ మ్యూజిక్ వీడియో కోసం అషూ రెడ్డి దుబాయ్ వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక అషూ మీద నిత్యం ఏదో ఒక ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ తర్వాత ఆమెపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరిగింది. కానీ అషూ రెడ్డి మాత్రం వాటిని ఏం పట్టించుకోదు. అషూ రెడ్డి ఆస్పత్రి పాలవ్వడంతో ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.