టాలీవుడ్, సోషల్ మీడియాలో బిగ్ బాస్ దివికి ఫాలోయింగ్ బాగా పెరిగింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత దివి కెరీర్ మొత్తం మారిపోయిందని చెప్పొచ్చు. బిగ్ బాస్ స్టేజ్ మీద మెగాస్టార్ చిరంజీవి ఆమెకు మాటిచ్చిన విధంగా గాడ్ ఫాదర్ సినిమాలో ఒక కీ రోల్ ప్లే చేేసేందుకు అవకాశం కల్పించారు. గతంలోనూ నటిగా అడపా దడపా కనిపించినా కూడా దివికి బ్రేక్ త్రూ దొరకలేదనే చెప్పాలి. బిగ్ బాస్ ద్వారా వచ్చిన అవకాశాన్ని ఈ సొట్టబుగ్గల చిన్నది బాగా సద్వినియోగం చేసుకుంది.
నటిగా ప్రయత్నాలు చేస్తూనే దివి కవర్ సాంగ్స్ కూడా చేస్తోంది. ఇప్పటికే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక మాస్ బీట్ కు కాలు కదిపిన ఈ భామ.. డాన్సర్ గానూ తాను ఆకట్టుకోగలనని నిరూపించుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. రోజువారీ విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అలాగే ఘాటు ఫొటోషూట్లు, అందమైన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ చిన్నది పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
గ్రీన్ డ్రస్సులో ఘాటైన అందాలను ఒలకపోస్తూ వయ్యారాలుపోతున్న ఫొటోలు చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. యదపై ఉన్న పచ్చబొట్టుని చూపిస్తూ దివి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే అద్దంలో తన వీపు అందాలను సైతం చూపిస్తూ పెట్టిన చిత్రాలు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి. ఇటీవల క్రిిస్మస్ సందర్భంగానూ అభిమానులను విష్ చేస్తూ దివి హాట్ ఫొటోషూట్ చేసిన విషయం తెలిసిందే. ఈ భామ త్వరలోనే హీరోయిన్ గా సినిమా చేస్తే బావుంటుంది అంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.