అలాగే ఇటీవల కాలంలో విడాకుల పర్వం ఎక్కువగా నడుస్తుంది. హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్, ఐశ్వర్య, ధనుష్ వంటి జంటలు విడిపోయాయి. సమంత- నాగచైతన్య, పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్, నోయల్- ఎస్తేర్, అమీర్ ఖాన్- కిరణ్ రావ్, ఐశ్వర్య-ధనుష్ లు ఉన్నారు. తాజాగా మరో సెలబ్రిటీ జంట ఆ జాబితాలో చేరనుంది.
సినిమా రంగంలో ప్రేమ పెళ్లిళ్లు ఎన్నో. షూటింగ్ సమయంలో ప్రేమించుకోవడం ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకోవడం పరిపాటిగా మారింది. అయితే అనూహ్యంగా ఈ జంటలు విడిపోయి.. అభిమానుల గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నారు. సమంత- నాగచైతన్య, పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్, నోయల్- ఎస్తేర్, ఐశ్వర్య- ధనుష్ ఈ కోవకు చెందిన వారే. అలాగే ఇటీవల కాలంలో బాలీవుడ్ లో కూడా విడాకుల పర్వం ఎక్కువగా నడుస్తుంది. హృతిక్ రోషన్, సుస్సానే ఖాన్, అమీర్ ఖాన్- కిరణ్ రావ్ వంటి జంటలు విడిపోయాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో జంట వస్తుంది. 15 ఏళ్ల వివాహా బంధానికి స్వస్థి చెప్పారు.
బాలీవుడ్‌లో మరో జంట విడాకులకు సిద్దమైంది. ఇంద్రనీల్ సేన్ గుప్తా, నటి బర్క బిష్త్ విడిపోతున్నట్లు ప్రకటించారు. బర్క, ఇంద్రనీల్.. ‘ప్యార్ కె దో నామ్- ఏక్ రాధ, ఏక్ శ్యామ్’ అనే సీరియల్‌లో జంటగా నటించారు. 2007లో వచ్చిన ఈ సీరియల్ షూటింగ్ సమయాల్లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కాగా డ్యాన్స్ షో నాచ్ బలియే మూడో సీజన్‌లోనూ వీరిద్దరూ జంటగా పాల్గొన్నారు. 2008 మార్చిలో వివాహం చేసుకున్న వీరికి మీరా అనే కూతురు జన్మించింది. గత కొంత కాలంగా ఈ జంట దూరంగా ఉంటున్న సంగతి విదితమే. అయితే కలుస్తారని అభిమానులను ఆశిస్తున్న సమయంలో తాము విడాకులు తీసుకోబోతున్నట్లు తెలిపారు నటి బర్క. గత రెండేళ్లుగా వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తుండగా..తాజాగా విడాకులకు దరఖాస్తు చేశారు.
ఈ విషయంపై బర్క మాట్లాడుతూ..తాము విడాకులకు అప్లై చేశామని, త్వరలోనే అందుకు సంబంధించిన పత్రాలు త్వరలో వస్తాయని తెలిపారు. ‘నా జీవితంలో తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయమిదే! నేను ఇప్పుడు సింగిల్ మదర్‌ను. నా కూతురు మీరాయే నా సర్వస్వం. ప్రస్తుతం ఓటీటీలో కొన్ని మంచి ప్రాజెక్టులలో నటిస్తున్నాను. టీవీ, సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేసేందుకు సిద్ధం’ అని చెప్పుకొచ్చింది బర్క. మొత్తానికి 15 ఏళ్ల తమ వివాహ బంధానికి గుడ్ బై చెబుతున్నారు. ఇంద్రనీల్.. హిందీ, బెంగాలీ భాషల్లో అనేక సినిమాల్లో నటించాడు. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌తో పాటు రాజ్‌నీతి వంటి పలు చిత్రాల్లోనూ నటించారు బర్క. తెలుగులో ఐతే 2లోనూ ముఖ్య పాత్ర పోషించాడుఇంద్రనీల్ . అయితే ఇంద్రనీల్ .. బెంగాలీ నటి ఇషా సాహాతో డేటింగ్ చేస్తున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.