కమెడియన్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బండ్ల గణేష్. ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాలు తీశారు. నిర్మాతగా కంటే ఆయన మాటలతోనే చాలా ఫేమస్ అయ్యారు. ఆడియో ఫంక్షన్లలో తనకు తోచిందే, అనిపించిందే మాట్లాడుతుంటారు.
కమెడియన్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బండ్ల గణేష్. ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాలు తీశారు. నిర్మాతగా కంటే ఆయన మాటలతోనే చాలా ఫేమస్ అయ్యారు. ఆడియో ఫంక్షన్లలో తనకు తోచిందే, అనిపించిందే మాట్లాడుతూ.. ఆయనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఇంటర్వ్యూలు ఇచ్చి ఫన్ జనరేట్ చేస్తుంటారు. టాలీవుడ్ పవర్ స్టార్ వపన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్ ఏదో ఒక అంశంపై ట్వీట్లు చేసి వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ కలవరపాటుకు గురి చేస్తుంది. తాజాగా ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పిక్ ఒకటి వైరల్ అవుతుంది.
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. బండ్ల గణేష్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన అనారోగ్యం బారిన పడటం ఇది తొలిసారి కాదు. గతంలో కరోనా సమయంలో కూడా కోవిడ్ బారిన పడ్డారు. మూడు సార్లు కరోనా బారిన పడి కోలుకున్నారు. కాంగ్రెస్ నేత కూడా అయిన బండ్ల గణేష్ రాజకీయంగా యాక్టివ్ అవుతున్న సమయంలో ఇప్పుడు ఆసుపత్రిలో చేతికి క్యాన్లాతో కనిపించారు. దీంతో ఆ ఫోటోను చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే తనకు ఆరోగ్యం బాలేదంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ‘మిమ్మల్ని కాపాడేందుకు ఎవ్వరూ రారు. ఈ జీవితం మీది. 100 శాతం మీదే బాధ్యత’ అంటూ మీ సేఫ్ అంటూ ట్వీట్ చేశారు.
Good morning 🙏#Besafe pic.twitter.com/QtDOQaLVKU
— BANDLA GANESH. (@ganeshbandla) July 13, 2023