ఇండస్ట్రీలో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ ఒకేలా గౌరవించే వ్యక్తి నందమూరి బాలకృష్ణ. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలని తేడా లేకుండా అన్ని సినిమాలు ఆడాలని కోరుకునే బాలయ్య.. తనవంతు ప్రమోషన్ కూడా చేస్తుంటారు. సినిమా బాగుంటే ఆ సినిమా జనంలోకి మరింత తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో అడివి శేష్ నటించిన హిట్ 2 సినిమాని తన తనయుడు మోక్షజ్ఞ తేజతో కలిసి వీక్షించారు. అడివి శేష్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా డిసెంబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రిలీజ్ అయిన మొదటిరోజు నుంచి సినిమా మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈ తరుణంలో బాలకృష్ణ ఈ సినిమాని చూడడం ద్వారా సినిమాకి మరింత మైలేజ్ నిచ్చారు.
హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో హిట్ 2 ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. మోక్షజ్ఞ తేజ, నాని, అడివి శేష్, శైలేష్ కొలనుతో కలిసి సినిమాని చూశారు. సినిమాని చూసి బయటకు వచ్చిన తర్వాత అడివి శేష్, నాని, దర్శకుడు శైలేష్ కొలనుకి అభినందనలు తెలియజేశారు. తాను సినిమా చాలా ఎగ్జైట్ అయ్యానని, చాలా సినిమాని ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చారు. మైండ్ బ్లోయింగ్ అని కొనియాడారు. చాలా సేపు టీమ్ తో ముచ్చటించారు. అయితే బాలకృష్ణతో కలిసి మోక్షజ్ఞ తేజ కూడా ఇలా సందడి చేయడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ బయటకు కనిపించని మోక్షజ్ఞ తేజ.. ఇలా తండ్రితో కలిసి సినిమా చూడడం చాలా సంతోషంగా ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
మొన్నా మధ్య ఏఎంబీ మల్టీప్లెక్స్ లో మోక్షజ్ఞ తేజ ఒక్కడే సోలోగా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆ సమయంలో గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏ సినిమా చూశాడో తెలియదు గానీ సినిమాలు మాత్రం బాగా చూస్తాడని ఇప్పుడు హిట్ 2 సినిమా స్క్రీనింగ్ లో కనబడుతుంటే తెలుస్తుంది. మరి మోక్షజ్ఞ తేజ మల్టీప్లెక్స్ ల్లో ఎంట్రీ కాకుండా.. థియేటర్ స్క్రీన్ మీద ఎప్పుడు దర్శనమిస్తాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా చేస్తున్నాడన్న వార్త చెవిన పడితే సంతోషించాలని అనుకుంటున్నవాళ్ళు చాలా మందే ఉన్నారు. అది మేటర్. ప్రస్తుతం బాలకృష్ణ, మోక్షజ్ఞతో కలిసి సినిమా చూసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.