నందమూరి బాలకృష్ణ.. యాంకర్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ షో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్‌స్టాబుల్ సీజన్ 1 క్రియేట్ చేసిన రికార్డులు.. క్రేజ్ కారణంగా నిర్వాహకులు.. అన్‌స్టాపబుల్ సీజన్ 2ని ప్రారంభించారు. ఇక ఈ సీజన్‌కి కాస్త పొలిటికల్ టచ్ కూడా ఇస్తున్నారు నిర్వాహాకులు. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిలు వంటి పాల్గొనగా.. నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, రాఘవేంద్ర రావు తదితర దిగ్గజాలతో పాటు.. శర్వానంద్, అడవి శేష్, విశ్వక్ సేన్, సిద్ధు వంటి హీరోలు సందడి చేశారు. ఇక అప్‌కమింగ్ ఎపిసోడ్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ తాజాగా ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతుంది.
అదేంటంటే.. అన్‌స్టాపబుల్ సీజన్ 2లో డార్లింగ్ ప్రభాస్ పాల్గొనబోతున్నారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇది ప్రచారం కాదు.. నిజమే.. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయ్యిందని.. సమాచారం. అంతేకాక.. డార్లింగ్ ప్రభాస్ అన్‌స్టాపబుల్ షూటింగ్‌లో పాల్గొన్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
లీకైన వీడియోలోని విజువల్స్ చూస్తుంటే బాలయ్య.. ప్రభాస్‌ను వేదిక మీదికి ఆహ్వానించిన సమయంలోనిది అని అర్థం అవుతోంది. ఇక ఎపిసోడ్‌లో భాగంగా.. బాలయ్య.. ప్రభాస్‌ను ఏవో చిలిపి ప్రశ్నలు బాలయ్య అడిగినట్లు అర్థం అవుతోంది. బహుశా ప్రభాస్ డ్రెస్సింగ్ గురించి బాలకృష్ణ ఈ ప్రశ్న అడిగి ఉంటాడని అర్థం అవుతోంది. ప్రభాస్ డ్రెస్సింగ్‌ని ఉద్దేశించి.. బాలయ్య.. నీ షర్ట్ సైజ్ ట్రిపుల్ ఎక్స్ఎలా, ఫోర్ ఎక్స్‌ఎలా అంటూ బాలయ్య ప్రశ్నించినట్లు అర్థం అవుతోంది.
దానికి ప్రభాస్ ‘‘కేవలం షర్ట్ సైజ్ మాత్రమే కాదు.. నాకు షూ దొరకడం కూడా కష్టమే. షూ సైజ్ 13’’ అని ప్రభాస్ సమాధానం ఇస్తారు. అయితే ఈ డైలాగ్స్ ఏవి సరిగా వినపించలేదు. ఇక ప్రభాస్ సమాధానం విన్న బాలయ్య.. ఫన్నీగా ‘వెంకటేశ్వర స్వామి పాదం అంటారు దాన్ని’ అని కామెంట్ చేశాడు. ఆ మాటలకు ప్రభాస్ పగలబడి నవ్వాడు. ఈ ఒక్క విజువల్ చూస్తుంటూనే ఎపిసోడ్ మొత్తం ఎంత సరదాగా ఉండబోతుందో అర్థమవుతోంది. ఇక క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది అని సమాచారం.
ఇక ఈ ఇద్దరి హీరోల సినీ కెరీర్ విషయానికి వస్తే.. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సంక్రాంతి సందర్బంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ తదుపరి సినిమా ఉండనుంది. ఇక డార్లింగ్ విషయానికి వస్తే.. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, మారుతి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్నాయి. ‘ఆదిపురుష్’ కూడా వచ్చే సంవత్సరం విడుదల కానుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఆహాలో ప్రసారం కాబోయే ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Darling 💛😍😘#NBKWithPrabhas#UnstoppableWithPrabhas#UnstoppableWithNBKS2 pic.twitter.com/Rdl8quPNSO
— Prabhas™ (@Prabhas_Team) December 11, 2022