ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా అఖండ గురించే చర్చ.. సింహా, లెజెండ్ తర్వాత నటసింహ బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన చిత్రం “అఖండ”. అత్యంత భారీ బడ్జెట్ తో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించి సూపర్ డుపర్ హిట్ అయింది. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్ లో సైతం ఈ చిత్రం కలెక్టన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం నాలుగురోజులోనే 66 కోట్ల 70 లక్షలు గ్రాస్ రాబట్టుకుంది. ఇండస్ట్రీ ఆశ్చర్యపోయే రీతిలో కలెక్షన్స్ వసూలు చేస్తోంది.
బోయపాటి మాస్ టేకింగ్, బాలకృష్ణ యాక్షన్, తమన్ మ్యూజిక్.. అన్నీ కలిపి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని బాలయ్య అభిమానులు అంటున్నారు. చిత్రానికి ఎస్.ఎస్.థమన్ ఇచ్చిన మ్యూజిక్ సెన్సేషన్ సృష్టిస్తుంది. కొన్ని సీన్లలో బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ దిమ్మతిరిగిపోతుందని అభిమానులు అంటున్నారు. ‘పరమాత్ముడు గురించి అద్భుతంగా చూపించి.. హిందూ ధర్మాలని నాశనం చేయాలని చూస్తే..పంచభూతాలకు విరుద్ధంగా ప్రవర్తించేవాళ్లను కచ్చితంగా ఆ పరమాత్ముడు శిక్షిస్తాడు..’ అని హిందూ ధర్మం గురించి మంచి మేస్సేజ్ ఇచ్చారు దర్శకుడు బోయపాటి.
అఖండ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ. అంతే కాదు బుల్లితెరపై వస్తున్న ఆహా అన్‌స్టాపెబుల్ షో తో సినీ ప్రముఖులతో తనదైన స్టైల్లో ఇంటర్వ్యూ తీసుకుంటూ సందడి చేస్తున్నారు. తాజాగా బాలకృష్ణ ఓ మూవీలో గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాద్ కలయికలో వస్తోన్న ‘లైగర్’ చిత్రం గురించి మనందరికీ తెలిసిందే.. బాక్సింగ్ నేపధ్యంలో రూపొందుతోన్న ఆ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో పూరీ, బాలయ్య కాంబినేషన్లో పైసా వసూల్’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూరీ అడగ్గానే బాలయ్య కథ విని ఇంప్రెస్స్ అయి కామియో రోల్ చేయడానికి ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.