సాధారణంగా సినిమాలలో సన్నివేశాలపై, సాంగ్స్ పై వివాదాలు జరగడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఆయా సినిమాలలో ఉన్న అభ్యంతరకమైన సన్నివేశాలు, సాంగ్స్ గురించి భారీ ఎత్తున వివాదాలు క్రియేట్ చేస్తుంటారు. అయితే.. ఇప్పటివరకు సినిమాలలో చూపించే సాంగ్స్, సన్నివేశాలపై వివాదాలతో పాటు కొన్ని వర్గాలవారు మనోభావాలు కూడా దెబ్బతిన్నాయంటూ రచ్చ చేస్తుంటారు. ఆ రచ్చ కాస్తా దేవుడికి లింక్ పెట్టేసి.. సినిమాలో అదెలా పెట్టారు? ఇదెలా పెట్టారు? వెంటనే తొలగించాలని డిమాండ్స్ కూడా మొదలు పెట్టేస్తారు. అయితే.. సాంగ్స్ అయినా, సన్నివేశాలైనా అభ్యంతరకరంగా ఉన్నప్పుడు వాటిని తొలగించాలని డిమాండ్ చేయడంలో తప్పులేదు.
పైగా సినిమా పోస్టర్స్, హీరోల కటౌట్స్, దిష్టి బొమ్మలను కూడా పబ్లిక్ ప్రదేశాలలో తగలబెట్టడం కూడా ఓకే. కానీ.. ఇటీవల ఓ సాధువు.. రోడ్డుపై ధర్నా చేస్తూ.. ఏకంగా సినిమా హీరోనే కాల్చి చంపేస్తాం అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మరి ఇంతకీ ఎవరా హీరో? ఆ హీరోకి వార్నింగ్ ఇచ్చిన సాధువు ఎవరు? అసలు వివాదం ఏంటనే వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా ‘పఠాన్’ అనే భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ రూపొందిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇక పఠాన్ సినిమాని వరల్డ్ వైడ్ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 2023 జనవరి 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే.. షూటింగ్ ముగించుకొని రిలీజ్ కి రెడీగా ఉన్న పఠాన్ సినిమా ప్రమోషన్స్ ఇటీవలే గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో సినిమా నుండి టీజర్.. ఆ తర్వాత ‘బేషరం రంగ్’ అనే రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడీ బేషరం రంగ్ సాంగ్ వల్లే.. పఠాన్ సినిమాపై వివాదాలు క్రియేట్ అయ్యాయి. ఈ సాంగ్ లో దీపికా పదుకొనే డ్రెస్సింగ్ స్టైల్ దాదాపు బికినీ టైప్ లో ఉండటమే కాకుండా.. అభ్యంతరకరంగా గ్లామర్ షో చేసిందని.. ఆమె ధరించిన కాషాయపు రంగు దుస్తులు దేవుడ్ని అవమానించే విధంగా ఉపయోగించారని కొన్ని వర్గాల వారు తీవ్ర విమర్శలు ప్రారంభించారు.
దీంతో బేషరం రంగ్ సాంగ్ వివాదం కాస్త ముదిరి.. నెట్టింట బాయ్ కాట్ ట్రోల్స్ తో పాటు కొన్ని ప్రాంతాలలో సినిమాని రిలీజ్ చేయనివ్వం అని పఠాన్ చిత్రబృందానికి వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సాంగ్ లో దీపికా డ్రెస్సింగ్ స్టైల్ మార్చాలని.. లేదా పూర్తి సాంగ్ తొలగించాలని డిమాండ్స్ బయటికి వచ్చాయి. ఇలాంటి తరుణంలో అయోధ్యకి చెందిన సాధువు జగద్గురు పరమహంస ఆచార్య.. బేషరం పాటపై.. దీపికా డ్రెస్సింగ్ పై.. షారుఖ్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పఠాన్ సినిమా విషయంలో ఇప్పటికైతే షారుఖ్ పోస్టర్ నే కాల్చాము.. ఇకపై షారుఖ్ తీరు ఇలాగే కొనసాగితే అతన్ని కూడా కాల్చి చంపుతాం అంటూ హెచ్చరించారు ఆచార్య.
ఆచార్య మాట్లాడుతూ.. ” బేషరమ్ రంగ్ సాంగ్ లో దీపికా కాషాయ రంగు వస్త్రాలు ధరించింది. ఆ సాంగ్ లో దీపికా నృత్య భంగిమలు అసభ్యకరంగా ఉన్నాయ్. కాషాయ రంగు దుస్తులను అలా ఎలా వాడారు. అలా దేవుడి రంగును అవమానిస్తారా? షారుఖ్ ఖాన్ తమకు సంబంధించిన ప్రవక్తల మీద సినిమాలు చేయడం లేదు. కానీ.. సనాతన ధర్మాన్ని ఇలా ఎందుకు అవమానిస్తున్నాడు? తమ ప్రవక్తలపై సినిమాలు చేసే దమ్ము షారుఖ్ లో లేదు. ఎవరైనా అవమానిస్తే శిక్ష తప్పదు. నాకు షారుఖ్ ని చూస్తే సజీవ దహనం చేయాలి అన్నంత కోపం ఉంది.” అని ఫైర్ అయ్యారు. దీన్ని బట్టి.. బేషరం సాంగ్ విషయంలో కొన్నివర్గాలు మాత్రమే హర్ట్ అయ్యాయని, మిగతా ప్రేక్షకులు సాంగ్ లో బాగుందని అనడం విశేషం. ఇప్పటివరకు ఈ ఇష్యూపై పఠాన్ టీమ్ స్పందించలేదు. కానీ.. సినిమాకి బజ్ మాత్రం బాగానే ఉంది. చూడాలి మరి పఠాన్ విషయంలో సాధువు చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలు తెలియజేయండి.