ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ సినిమాలలో అవతార్ 2 ఒకటి. టైటానిక్, అవతార్ లాంటి వరల్డ్ క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ నుండి వస్తున్న మరో విజువల్ వండర్ ఈ అవతార్ 2. అవతార్ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా దాదాపు 13 సంవత్సరాలకు తెరమీదకు రాబోతుంది. వరల్డ్ వైడ్ దాదాపు 160 భాషల్లో అవతార్ 2 సినిమా డిసెంబర్ 16న రిలీజ్ అవుతోంది. అయితే.. సినిమా రిలీజ్ ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డులు తిరగరాస్తోంది. ముఖ్యంగా ఇండియాలో ఫ్యాన్స్ అవతార్ 2 కోసం ఎంతో ఎక్సయిట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ట్రైలర్స్ లో విజువల్స్ తో అద్భుతమైన ఫీలింగ్ కలిగించిన అవతార్ 2.. ఈ ఏడాది ఇండియాలో కలెక్షన్స్ వర్షం కురిపించిన కేజీఎఫ్-2 సినిమా రికార్డుని సునాయాసంగా బ్రేక్ చేసేసింది. ఇదివరకూ ఏ సినిమా విషయంలోనూ చూడని అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్.. అవతార్ 2కి నమోదు అవుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్స్ లో టాపర్ గా నిలిచిన కేజీఎఫ్ 2 మూవీ రికార్డు కనుమరుగైపోవడం గమనార్హం. ఇండియాలో ఇండియన్ సినిమాలను మించి అవతార్ 2 రికార్డులు సృష్టిస్తుండటం ఆశ్చర్యకరంగా మారింది. ఇండియాలో అవతార్ 2 ఓపెనింగ్ కలెక్షన్స్ పై అంచనాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో అవతార్ 2కి మొదటి రోజు ఇండియాలో సుమారు రూ. 35 – 40 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. రిలీజ్ కి ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే.. అవతార్ 2 కోసం ఇండియాలో 4,41,960 మంది అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారట. గతంలో ఏ సినిమాకి ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగకపోవడం గమనార్హం. కాగా.. ఇండియాలో కేజీఎఫ్ 2 సినిమాకి 4,11,000 మంది అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు. ఆ తర్వాత బ్రహ్మస్త్రకి 3,02,000.. దృశ్యం 2కి 1,16,000.. RRRకి 1,05,000 టికెట్లు బుక్ అయినట్లు సమాచారం. అయితే.. అవతార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు రిలీజ్ ముందు రోజు వరకు మరింత పెరగనున్నాయి. అదీగాక తొలి మూడు రోజుల్లో అవతార్ 2 ఇండియాలోనే కనీసం రూ. 100 కోట్లు టార్గెట్ తో బరిలోకి దిగనుందని టాక్. చూడాలి మరి అవతార్ 2 ఇండియాలో ఎలాంటి వసూళ్లు రాబడుతుందో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.