ప్రభాస్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్ట్ కే. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిన్న పాత్ర లభించినా చాలని చాలా మంది అనుకుంటారు. అలాంటిది ఈ చిత్రంలో తారకరత్నకు మంచి రోల్ ఇవ్వాలని భావించారట. ఈ విషయాన్ని అశ్వినీదత్ స్వయంగా వెల్లడించారు. ఆ వివరాలు..
నందమూరి తారకరత్న అత్యంత చిన్న వయసులోనే కనీసం 40 ఏళ్లు కూడా నిండకుండానే కన్ను మూశాడు. తారకరత్న మృతితో ఆయన కుటుంబంలోనే కాక ఇండస్ట్రీలో, టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. మరో విషాదం ఏంటంటే నాలుగు రోజుల్లో 40వ పుట్టిన రోజు జరుపుకోవాల్సిన తారకరత్న.. శివరాత్రి రోజున అనగా ఫిబ్రవరి 18న కన్నుమూశారు. ఇక ఫిబ్రవరి 22న ఆయన పుట్టినరోజు. అంటే నేడు తారకరత్న తొలి జయంతి. ఈ క్రమంలో అభిమానులు గతంలో తారకరత్న తన బాబాయ్ బాలకృష్ణతో కలిసి పుట్టిన రోజు జరుపుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక తారకరత్నకు బాలయ్య ఎన్బీకే 108లో మంచి పాత్ర ఇవ్వాలని అనుకున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నిర్మాత అశ్వినీదత్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఆ వివరాలు..
తారకరత్న మృతికి సంతాపం తెలిపిన నిర్మాత అశ్వినీదత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘తారకరత్న మృతి చెందాడు అంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. ఇది చాలా విషాదకరమైన వార్త. కొన్ని రోజుల క్రితమే తారకరత్న గురించి చర్చించుకున్నాం. ప్రభాస్-నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే చిత్రంలో తారకరత్నకు మంచి పాత్రి ఇవ్వాలనుకున్నాం. దీని గురించి నేను, నాగ్ అశ్విన్ కొన్ని రోజుల క్రితమే మాట్లాడుకున్నాం. కొన్ని రోజుల్లో తారకరత్నకు ఈ విషయం చెపుదాం అన్నుకున్నాం. కానీ ఈ లోపే ఇంత విషాదం చోటు చేసుకుంది. తారకరత్న మన మధ్య లేడు అన్న చేదు నిజం వినాల్సి వచ్చింది’’ అన్నారు. తారకరత్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇక హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారకరత్న అనుకున్న మేర సక్సెస్ కాలేదు. తర్వాత అమరావతి చిత్రంలో విలన్ పాత్రతో మెప్పించాడు. నంది అవార్డ్ కూడా అందుకున్నాడు. కానీ అది కూడా ఆయన కెరీర్‌కు ప్లస్ కాలేదు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించాడు. ఇక సినిమాలు వదిలేసి.. ఈ ఏడాది రాజకీయాల్లోకి రావాలని భావించాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తారకరత్న ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించాడు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ ఆలోపే ఇంతటి విషాదం చోటు చేసుకుంది. కెరీర్ గురించి తీవ్ర ఒత్తిడికి గురవ్వడం వల్లే తారకరత్న హార్ట్ ఎటాక్ బారిన పడ్డాడని సన్నిహితులు అంటున్నారు.
నిజంగా అశ్వీనదత్ చెప్పినట్లుగా తారకరత్న బతికుండి.. ఆయన గనక ప్రాజెక్ట్ కే సినిమాలో నటించి ఉంటే.. ఆయన కెరీర్ ఊహించని మలుపు తిరిగి ఉండేది. భారీ బడ్జెట్‌తో.. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారకరత్నకు మంచి పాత్ర లభించి ఉంటే.. తన కెరీర్ పుంజుకునేది అంటున్నారు అభిమానులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.