ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ AR రెహ్మాన్ ఇంట పెళ్లి సందండి జరిగింది. రెహ్మాన్ పెద్ద కూతురు ఖతీజా రెహ్మాన్ వివాహం వైభవంగా జరిగింది. రియాస్దీన్ షేక్ మహమ్మద్ అనే ఆడియో ఇంజినీర్ ని ఖతీజా రెహ్మాన్ వివాహ చేసుకుంది. పలువురు సినీ ,రాజకీయ ప్రముఖులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెళ్లి సంబంధించిన ఫోటో..రెహ్మాన్ తన ఇన్ స్టాలో షేర్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి.
ఇదీ చదవండి: అలా అయితే నేను సూసైడ్ చేసుకుంటా: KGF కెమెరా మెన్
ఈ పెళ్లిలో వరుడు రియాస్దీన్ తెల్లటి షేర్వానీలో కనిపించగా ఖతీజా ప్రింటెడ్ ఆఫ్ వైట్ దుస్తులో ముస్తాబైంది. ఆ దేవుడు ఈ జంటను ఆశీర్వదించాలని కోరుతూ ఆ ఫోటోకు రెహ్మాన్ ట్యాగ్ చేశారు. జీవితంలో ఇది ఎంతో సంతోషకర దినమని, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు ఖతీజా కూడా తన ఇన్‌స్టా పోస్టులో రాసింది. రెహ్మాన్ కూతురు ఖతీజా విషయానికి వస్తే.. ఆమె మంచి గాయని. 2010లో విడుదలైన ‘రోబో’సినిమాలో ‘ఓ మరమనిషి’ పాటను దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆలపించారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన కృతిసనన్ ‘మీమీ’ చిత్రంలో ‘రాక్‌ఏ బై బేబీ’ పాటను కూడా పాడారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.