టాలీవుడ్ లో బుల్లితెరపై ఎందరో యాంకర్స్ ఉన్నారు. ఎంత మంది ఉన్నా ఎవరి స్టైల్ వారిదే. ఎప్పటికప్పుడు తమ అందాలు ఆరబోస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు యాంకర్ భీమినేని విష్ణుప్రియ. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది విష్టు. యాంకర్స్ అనసూయ, శ్రీముఖి, రష్మీని మించిన రేంజ్‌లో అందాలు ఆరబోస్తూ ఉండడంతో ఇటీవల యూత్ లో విష్టు ప్రియాకు మంచి క్రేజ్ వచ్చేసింది.
విష్ణు ప్రియ యాంకర్ కావడానికి ముందు తెలుగు, కన్నడం, తమిళం, మలయాళ భాషల్లో పలు వెబ్ సీరిస్‌లలో నటించింది. ఇక తెలుగులో బుల్లితెరపై అడుగుపెట్టాక తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక విష్ణు ప్రియ సోషల్ మీడియా అకౌంట్లు ఫాలో అయ్యేవారికి ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో ఆమె అందాల విందు చేస్తూనే ఉంటుంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో విష్ణు ప్రియ పలు ప్రొడక్ట్ లను, ప్రముఖ బ్రాండ్లను బాగా ప్రమోట్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఓయో రూంస్ ను ప్రమోట్ చేస్తోంది.దేశంలోని ప్రధాన నగరాల్లో ఓయో రూమ్స్ హవా నడుస్తోంది. అయితే గతంలో ఓ సారి ఈ ఓయో రూమ్స్ గురించి ప్రస్తావిస్తూ ఇవి చాలా సౌకర్యవంతంగా ఉన్నాయని చెప్పిన విష్ణు ప్రియ.. ఇప్పుడు మరోసారి అదే రకమైన పోస్ట్ పెట్టి ఓయో రూమ్స్ స్పెషాలిటీస్ వివరిస్తూ ఇన్స్‌స్టాగ్రామ్‌లో వీడియో లు కూడా పోస్ట్ చేసింది.
‘నేను మొదటి సారి ఓయో రూమ్ లోకి వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఇక ఆ బెడ్స్ అయితే ఎంత మెత్తగా ఉంటాయో. నేను ఫుల్ శాటిస్ ఫై. నేను మళ్లీ నా పనులు మొదలుపెట్టి షెడ్యూల్ చేసుకునే ముందే నేను ఓయో రూంను బుక్ చేసుకోవాలని అనుకుంటున్నాను’..అంటూ ఈ భామ పోస్ట్ పెట్టడం విశేషం. అసలే అందాల యాంకరమ్మ, తాను ఓయో రూమ్ లో ఫుల్ శాటిస్ ఫై అయ్యానని పోస్ట్ చేయడంతో ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. ఓయో రూమ్స్ ని ప్రమోట్ చేసే ప్రాసెస్ లో విష్ణుప్రియ చేసిన ఈ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.