ఈ మధ్యకాలంలో హ్యాకర్ల బెడద ఎక్కువైంది. సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకుని వారి సోషల్ మీడియాల ఖాతాలను హ్యాక్ చేస్తుంటారు. ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యక్ అయ్యాయి. అయితే సదరు సెలబ్రిటీలు వెంటనే గుర్తించి.. అభిమానులను అలెర్ట్ చేస్తున్నారు. ఇలా పలువురు ప్రముఖల అకౌంట్లను హ్యాక్ చేసి అశ్లీల వీడియోలు సైతం పోస్ట్ చేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బుల్లితెర యాక్టర్, ఫేమస్ యాంకర్ విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ కూడా హ్యాక్ గురైనట్లు స్వయంగా ఆమె వెల్లడించింది. ఆమె సోషల్ మీడియా అకౌంట్లలో అశ్లీల వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అయితే ఎవరో తన అకౌంట్ హ్యాక్ చేసి ఈ వీడియోలను పోస్ట్ చేసినట్లు ఆమె పేర్కొంది. విష్ణు ప్రియా అకౌంట్లోనే ఎందుకు బూతు వీడియోలు కనిపిస్తున్నాయని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు.
విష్ణు ప్రియ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘పోవే పోరా’ అనే బుల్లితెర షో ద్వారా ఈ బ్యూటీ క్రేజ్ ను సంపాదించుకుంది. అతి తక్కువకాలంలో పలు షోల్లో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈక్రమంలో సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదించుకుంటుంది. ఈ బ్యూటీ ఇటీవల ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలో నటించి.. అందాలు ఆరబోసింది. గతంలో కూడా కొన్ని సినిమాలో నటించింది. ఓ పక్క టీవీ షోస్, మరోపక్క ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉండే విష్ణు ప్రియ.. తన అందాల గేట్లు తెరిచేసి అట్రాక్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తన హాట్ ఫిక్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. అనేక తన హాట్ ఫొటోలు, వీడియోలతో యూత్ ను తనవైపు లాక్కుంటుంది.
యాంకర్లలో ఈ రేంజ్ గ్లామర్ షో ఎవ్వరూ చేయలేరు అనే విధంగా ఆ ఫోటోలు ఉంటాయి. అందుకే ఈమె ఫేస్ బుక్ ఖాతాలో ఫాలోవర్స్ భారీగా ఉన్నారు. అయితే తాజాగా యాంకర్ విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ లో అశ్లీల చిత్రాలు కలకలం సృష్టించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ విషయంపై మొన్నామధ్య తన ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయినట్టు విష్ణు ప్రియ కూడా చెప్పుకొచ్చింది. తన ఫేస్ బుక్ అకౌంట్ లో అశ్లీల వీడియోలు, ఫోటోలు పోస్ట్ అవుతున్నాయని, కొన్ని రోజుల తనని అన్ ఫాలో చేయమని విష్ణు ప్రియ తెలిపింది. ఆ తర్వాత ఈ అమ్మడి ఫేస్ బుక్ అంతా బాగానే ఉంది అనుకున్న తరుణంలో ఇప్పుడు తాజాగా మరోసారి ఆమె ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందట.
ఈ విషయాన్ని విష్ణుప్రియానే తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ..”చాలా మంది నా స్నేహితులు, బంధువులు ఫోన్ చేసి నీ ఫేస్ బుక్ లో అలాంటి వీడియోలేంటని అంటున్నారు” అని విష్టు ప్రియా చెప్పుకొచ్చింది. అవి తాను పోస్ట్ చేసినవి కాదని, వాటికి తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పిందట. ఆమె ఫేస్ బుక్‌లో ఇప్పటికీ అశ్లీల వీడియోలు పోస్ట్ అవుతూనే ఉన్నాయని, అప్పటి నుండి ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంత జరుగుతున్న విష్ణుప్రియ.. సైబర్ క్రైమ్‌ని ఆశ్రయించడం కానీ.. ఆ పేజ్‌ని డిలీట్ చేయించడం కానీ చేయలేదు. ఈ ఇష్యూపై నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.