తెలుగు బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు వచ్చినా.. సుమను మాత్రం ఎవరూ బీట్ చేయలేకపోతున్నారు. బుల్లితెర మహారాణిగా వెలుగొందుతున్న యాంకర్ సుమ లేని ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఊహించుకోవడం కష్టం అంటుంటారు ఆడియన్స్.. ఆమె చేసే ప్రతి ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది.
తెలుగు బుల్లితెరపై తనదైన యాంకరింగ్ తో కోట్ల మంది ప్రేక్షకులను అకట్టుకున్న ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఎంతపెద్ద షో అయినా ఏమాత్రం తడబడకుండా తన మాటలతో ఆకట్టుకుంటుంది. సుమ జన్మతః మలయాళీ అయినా తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది. నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్ లో స్థిరపడిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల మూవీస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి సుమా యాంకరింగ్ లేనిదే జరగదు అన్న పరిస్థితి చేరుకుందంటే ఆమెను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అలాంటిది ఈ మద్య జరిగిన ఆదిపురుష్ ఈవెంట్ లో సుమ కనిపించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తాజాగా సుమ తనకు సంబంధించిన ఓ ఫోటో షేర్ చేసింది.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
తెలుగు బుల్లితెరపై తనదైన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన యాంకర్ సుమ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. బుల్లితెరపై ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు యాంకరింగ్ చేసింది. ఓ వైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే పలు ఈవెంట్స్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తన మేనరీజం, మాటలతో యాంకరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ అందరినీ అలరిస్తుంది. ఈ మద్య జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించిందని కామన్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని యాంకర్ సుమ ఇన్ స్ట్రాలో ఆడియన్స్ ప్రస్తావిస్తూ కామెంట్స్ చేశారు.
యాంకర్ సుమ సైతం ఆది పురుష్ ఈవెంట్ మిస్ అయ్యానని బాధపడుతూ వీడియో కూడా షేర్ చేసింది. ఈ వీడియోలో చిత్ర బృందం గురించి ప్రస్తావిస్తూ.. ప్రభాస్ కి బెస్ట్ విషెస్ చెప్పింది. యాంకర్ సుమ ప్రస్తుతం ఫారిన్ ట్రిప్ లో ఉంది.. ఫ్యామిలీతో కలిసి ప్యారిస్, స్విట్జర్లాండ్ దేశాల్లో విహారయాత్ర కోసం వెళ్లింది. ఎప్పటికప్పుడు ఈ ట్రిప్ గురించి ఫోటోలు, వీడియోలు ఇన్ స్ట్రాలో షేర్ చేస్తుంది. ట్రిప్ లో బాగా తిరగడం వల్ల తన కాళ్లకి గాయాలు అయ్యాయని.. షూస్ కొరికేయడంతో గాయాలు అయి తీవ్రమైన బాధ కలిగిస్తున్నాయని ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని కాలి వేళ్లకి ప్లాస్టర్స్ వేసిన ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.