చంద్రయాన్ 3 మిషన్ బడ్జెట్ ఒక పాన్ ఇండియా సినిమా కంటే తక్కువే అన్న చర్చ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి ఆ బడ్జెట్ ఎంతో తెలుసా?
తాజాగా ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 ప్రయోగం చేశారు. అది విజయం సాధించడంతో దేశం అంతటా పండుగ వాతావరణం నెలకొంది. అందరూ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. బహుబలి రాకెట్ ఎల్‌వీఎం-3 ఉపగ్రహం వాహక నౌక ద్వారా చంద్రయాన్ -3 ప్రయోగం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:35 నిమిషాలకు జరిగింది. దీన్ని మన ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. శ్రీ హరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం-3 దేశం మీసం తిప్పు అనేలా నింగిలోకి దూసుకెళ్లింది. మరి ఈ ప్రయోగానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? పాన్ ఇండియా సినిమాలకు పెట్టే బడ్జెట్ కంటే తక్కువ.
మామూలుగా రాకెట్ తయారీ అనగానే వేల కోట్ల ఖర్చు అవుతుంది. ఇదే మిషన్ ని ఏ విదేశీ వారో చేస్తే వేల కోట్లు ఖర్చు అవుతుంది. మన దేశం పెట్టే ఖర్చుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అసలు చంద్రయాన్ 3 ఖర్చు ఎంత ఉంటుందనుకుంటున్నారు. చంద్రుడి మీద అడుగుపెట్టడానికి మిషన్ తయారీకి అయిన ఖర్చు ఒక పాన్ ఇండియా సినిమా బడ్జెట్ కంటే తక్కువేనన్న చర్చ నడుస్తోంది. చంద్రయాన్ 3 బడ్జెట్ ఆదిపురుష్ బడ్జెట్ కంటే తక్కువన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ సినిమా అయిన ఆదిపురుష్‌కి దాదాపు 700 కోట్లు వరకు పెట్టారని.. అంతకంటే తక్కువ బడ్జెట్ లో 615 కోట్ల రూపాయలకే చంద్రయాన్ 3 మిషన్ ని లాంఛ్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు.
చంద్రయాన్ 3 మిషన్ బడ్జెట్ 615 కోట్లు అంటే.. బాలీవుడ్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ బడ్జెట్ అనే చెప్పాలి. ఇదే మిషన్ ని నాసానో, ఇంకేదో దేశం వారో చేయాలంటే వేల కోట్లు పైనే ఖర్చు పెడతారు. ఇంత తక్కువ బడ్జెట్ లో అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపడం అనేది అసాధ్యం. కానీ మన భారతీయులు మాత్రం ఒక సినిమా బడ్జెట్ లో చంద్రుడి మీదకు ఉపగ్రహాన్ని ప్రయోగించేసారు. దటీజ్ ఇండియా. మరి ఒక సినిమా బడ్జెట్ లో భారతదేశ ప్రతిష్టని నెలకొల్పే ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
🚨 Approximate Budget
• Adipurush – ₹700 Crore
• Chandrayaan 3 – ₹615 CroreGives a Fair Understanding of Priorities
— Ravisutanjani (@Ravisutanjani) July 8, 2023