తెలుగు బుల్లితెర పాపులర్ టీవీ షోలలో యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘క్యాష్’ ప్రోగ్రామ్ ఒకటి. ప్రతి వారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఈ ప్రోగ్రాంలో ఎప్పటికప్పుడు కొత్తగా రిలీజ్ కాబోతున్న సినిమాల టీమ్స్, ట్రెండింగ్ లో ఉన్న సెలెబ్రిటీలు సైతం ఈ షోలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా క్యాష్ ప్రోగ్రాంకి ‘సీతా రామం’ చిత్రబృందం పాల్గొంది. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ తో పాటు సుమంత్, తరుణ్ భాస్కర్, డైరెక్టర్ హను రాఘవపూడి ప్రోగ్రాంలో పాల్గొన్నారు.
ఇక తాజాగా విడుదలైన క్యాష్ ప్రోమో చూసినట్లయితే.. అంతా సందడిగానే సాగింది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ క్యాష్ లో కనిపించడమే సర్ప్రైజ్ అనుకుంటే.. ప్రోమోలో కూడా అతనే హైలైట్ అయ్యాడు. ఇక సుమ హోస్టింగ్ అంటే అందరికి తెలిసిందే. మొత్తం మాటలతో గారడీ చేసేస్తుంది. అయితే.. దుల్కర్ తో కలిసి సుమ స్టేజిపై చేసిన ‘మహానటి’ పెర్ఫార్మన్స్ ప్రస్తుతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మహానటిలోని సావిత్రి – జెమిని గణేష్ ల ప్రపోజల్ సీన్ లో సుమ, దుల్కర్ యాక్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో సుమతో కలిసి హీరో పెర్ఫర్మ్ చేయడమే కాకుండా ఏకంగా సుమతో కలిసి ఓ స్టెప్ వేయడం విశేషం. ప్రస్తుతం సుమ క్యాష్ ప్రోగ్రాం ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దుల్కర్ సల్మాన్ దంపతులు ఇంట్లో ఒకరినొకరు ‘జాన్’ అని పిలుచుకుంటారనే విషయం కూడా హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. సీతా రామం మూవీ ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ లేటెస్ట్ క్యాష్ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.